ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యంపై... కన్నా కీలక వ్యాఖ్యలు

అసెంబ్లీలో అన్నీ పార్టీలు అంగీకారంతోనే అమరావతి నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయం కాబట్టే... ప్రధాని మోడీ శంఖుస్ధాపనకు వచ్చారన్నారు.

news18-telugu
Updated: January 5, 2020, 11:49 AM IST
ఏపీ రాజధాని విషయంలో కేంద్రం జోక్యంపై... కన్నా కీలక వ్యాఖ్యలు
సీఎం జగన్,కన్నా లక్ష్మీనారాయణ(File Photos)
  • Share this:
ఏపీలో రాజధాని అంశంపై చోటు చేసుకున్న సందిగ్ధత పట్ల మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణజ కమిటీలు, వస్తున్న నివేదకల గురించి చర్చించాల్సిన అవసరం లేదన్నారు. జగన్ ప్రభుత్వం వేసిన కమిటీలు వారికే అనుకూలంగా నివేదికలు ఇస్తాయన్నారు. రాజధానిని మార్చే అవసరం ప్రస్తుత ప్రభుత్వానికి లేదన్నారు. రాష్ట్ర విభజన తర్వాత పొలిటకల్ కన్షన్ష్‌తోనే  అమరావతి రాజధాని నిర్ణయం జరిగిందన్నారు. అసెంబ్లీలో అన్నీ పార్టీలు అంగీకారంతోనే అమరావతి నిర్ణయం తీసుకున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయం కాబట్టే... ప్రధాని మోడీ శంఖుస్ధాపనకు వచ్చారన్నారు. రాజధాని ఎక్కడ పెట్టాలనేది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమేనన్నారు.

కేంద్రానికి సంబంధించిన విషయం కాదు కాబట్టి... ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని మేం చెప్పలేదన్నారు. రాజధాని విషయంలో తమ పార్టీలో బిన్నాభిప్రాయాలు లేవన్నారు కన్నా. రాష్ట్ర ప్రభుత్వం చేసుకునే పిచ్చి పనులలో కేంద్రం జోక్యం చేసుకోదన్నారు. చంద్రబాబు కూడా నాది అనే నియంత్రుత్వ ధోరణిలో ముందుకు వెళ్లారని గుర్తు చేశారు. ప్రజాక్షేత్రంలో ఫలితాలు ఏలా ఉంటాయో అందరూ చూశారన్నారు. రాజధాని మార్పు ఆపటానికి ప్రయత్నం చేస్తానన్నారు. అమరావతిలో జరుగుతున్నది  రైతుల ఉద్యమం కాదు... రాజధాని ఉద్యమమన్నారు కన్నా. రాజధాని కోసం రోడ్డుమీదకు వచ్చిన మహిళలపై పోలీసులను ప్రయోగించాడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వం రాక్షస పాలన చేస్తుందని తీవ్రస్థాయిలో కన్నా ధ్వజమెత్తారు.

First published: January 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు