రాజధానిపై సీఎం స్టాండ్ ఏంటి ? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కన్నా

రాజధాని అమరావతికి అప్పుడు జగన్ అంగీకరించారన్నారు. అధికారంలోకి వచ్చాక కొందరి కోసమే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని విమర్శించారు.

news18-telugu
Updated: August 23, 2019, 10:51 AM IST
రాజధానిపై సీఎం స్టాండ్ ఏంటి ? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన కన్నా
జగన్, కన్నా లక్ష్మీనారాయణ
  • Share this:
అమరావతిలోనే రాజధాని నిర్మాణం జరగాలన్నారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. రాజధానిపై వైఖరి ఏంటో సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. భారతీ జనతా పార్టీ రాజధాని రైతులకు అండగా ఉంటుందన్నారు. మూడు పంటలు పండే భూముల్ని రైతులు త్యాగం చేశారన్నారు. ఇప్పటికే వేలాది కోట్లు రాజధాని కోసం వెచ్చించారన్నారు. త్వరలో రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానన్నారు కన్నా. రాజధాని అమరావతికి అప్పుడు జగన్ అంగీకరించారన్నారు. అధికారంలోకి వచ్చాక కొందరి కోసమే వైసీపీ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు కనిపిస్తుందని విమర్శించారు. ప్రభుత్వం చెప్పేదానికి చేేసేదానికి పొంతన లేదని కన్నా ఆరోపించారు.

ఇవాళ రాజధాని రైతులంతా కన్నా లక్ష్మీనారాయణను కలిశారు. ప్రభుత్వ నిర్ణయాలు తమను అయోమయోంలో పడేస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేశారు రైతులు. రాజధానిని మారుస్తారన్న వార్తలతో రైతులంతా బాధలో ఉన్నారన్నారు. ఉన్న రాజధానిని జగన్‌ అభివృద్ధి చేయాలని కోరారు. రాజధాని కోసం అన్ని పార్టీల నేతలతో సమావేశమవుతామన్నారు అన్నదాతలు. ప్రభుత్వాన్ని నమ్మి భూములు ఇచ్చామని... పార్టీలను నమ్మి ఇవ్వలేదన్నారు రాజధాని రైతులు. 33వేల ఎకరాల భూములు ఇచ్చిన రైతులు ఏం కావాలన్నారు. అందుకే జాతీయ పార్టీ అయిన బీజేపీ నేతల్ని కలుస్తున్నామన్నారు. జాతీయ పార్టీ అయిన స్పందించి తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని కోరారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు