సీఎం జగన్, చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేసిన కన్నా

టీడీపీ నుంచి రాబోయే కాలంలో ఇంకొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరనున్నారని చెప్పారు. టీడీపీ ఇప్పుడు చచ్చిన పాములాంటిదని అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: July 29, 2019, 2:28 PM IST
సీఎం జగన్, చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు చేసిన కన్నా
కన్నా లక్ష్మీనారాయణ
news18-telugu
Updated: July 29, 2019, 2:28 PM IST
ఏపీ సీఎం జగన్, మాజీ సీఎం చంద్రబాబుపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీ నారాయణ. దివంగత నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో యువతకు ఉద్యోగాలు ఇచ్చి కడుపు నిండా అన్నం పెట్టారన్నారు.  కానీ ఆయన కుమారుడు సీఎం జగన్ మాత్రం ప్రజల పొట్టగొడుతున్నారని  కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఆ పార్టీ నేతలు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలను అనంతపురంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. రాజన్న పాలన తెస్తామంటూ జగన్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలపడలేకపోవడానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబే కారణమని మండిపడ్డారు. టీడీపీ, జనసేనల నుంచే కాకుండా వైసీపీ నుంచి కూడా చాలా మంది నేతలు బీజేపీలో వచ్చి చేరుతున్నారని చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు మౌలిక వసతులు కల్పించాల్సి ఉందని... ఆ విషయంలో చంద్రబాబు చేసిన జాప్యం వల్లే అనంతపురం సెంట్రల్ యూనివర్శిటీ వెనుకబడిందన్నారు. అనంతరం కేంద్ర మాజీ మంత్రి కృష్ణం రాజు మాట్లాడుతూ... బీజేపీలో చేరడానికి అన్ని పార్టీల నేతలు ఉత్సాహం చూపిస్తున్నారన్నారు. టీడీపీ నుంచి రాబోయే కాలంలో ఇంకొంత మంది మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చేరనున్నారని చెప్పారు. టీడీపీ ఇప్పుడు చచ్చిన పాములాంటిదన్నారు. గోదావరి జలాలను తెలంగాణకు తరలించాలన్న ప్రతిపాదన బాగున్నప్పటికీ.. ఏపీ నష్టం జరిగితే మాత్రం ఊరుకోమని హెచ్చరించారు బీజేపీ నాయకులు.

First published: July 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...