హోమ్ /వార్తలు /రాజకీయం /

నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది: ఏపీ బీజేపీ చీఫ్ కన్నా

నన్ను చంపేందుకు కుట్ర జరుగుతుంది: ఏపీ బీజేపీ చీఫ్ కన్నా

కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు

కన్నా లక్ష్మీనారాయణ, ఏపీ బీజేపీ అధ్యక్షుడు

నిన్నటి నుంచి చంద్రబాబు బీజేపీ నాయకుల్ని ఫినిష్ చేస్తామని చెబుతున్నారంటూ ఆరోపించారు కన్నా లక్ష్మీ నారాయణ. గతంలో అమిత్ షా, జగన్, పవన్‌లపై హత్యాయత్నం చేసిన టీడీపీ ఇప్పుడు నన్ను చంపడానికి కూడా కుట్ర చేస్తుందని విమర్శించారు.

  గుంటూరులో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇంటిని టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. కన్నా నివాసం ఎదుట ఆందోళనలకు దిగారు. ఈ ఘటనపై బీజేపీ నేత కన్నా స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఆదేశాలతోనే నన్ను చంపేందుకు టీడీపీ శ్రేణులు వచ్చాయని ఆరోపించారు. అందుకే తన ఇంటిని ముట్టడించారని మండిపడ్డారు.


  నిన్నటి నుంచి చంద్రబాబు బీజేపీ నాయకుల్ని ఫినిష్ చేస్తామని చెబుతున్నారంటూ ఆరోపించారు కన్నా లక్ష్మీ నారాయణ. గతంలో అమిత్ షా, జగన్, పవన్‌లపై హత్యాయత్నం చేసిన టీడీపీ ఇప్పుడు నన్ను చంపడానికి కూడా కుట్ర చేస్తుందని విమర్శించారు. గుంటూరులోని కన్నా నివాసాన్ని ముట్టడించేందుకు ఈరోజు టీడీపీ కార్యకర్తలు యత్నించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులతో కన్నా కుమారుడు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో, టీడీపీ-బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.


  ఈ ఘటనపై స్పందించిన కన్నా మాట్లాడుతూ, నిన్న కాకినాడ పర్యటనలో చంద్రబాబుకు వినతిపత్రం ఇచ్చేందుకు బీజేపీ కార్యకర్తలు ప్రయత్నించగా వారిని సీఎం హెచ్చరించారన్నారు. వారి విన్నపాలను ముఖ్యమంత్రి పట్టించుకోకుండా... బీజేపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారని మండిపడ్డారు. నడిరోడ్డు మీదే ఓ మహిళను ఫినిష్ చేస్తానంటూ సీఎం వార్నింగ్ ఇచ్చారన్నారు కన్నా. ఈ విషయంపై కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఈ ఘటనలపై తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ దృష్టి సారించాలని... రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడాలని కోరారు కన్నా లక్ష్మీనారాయణ.

  First published:

  Tags: Andhra Pradesh, AP Politics, Bjp-tdp, Chandrababu naidu

  ఉత్తమ కథలు