చంద్రబాబుకు బీజేపీ సపోర్ట్.. జగన్‌పై ఎటాక్

టీడీపీ అవినీతి జరిగిందని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారే కానీ, వాటికి ఆధారాలు చూపడం లేదని చంద్రబాబు అంటున్నార. ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహాలో మాట్లాడడం విశేషం.

news18-telugu
Updated: August 9, 2019, 2:59 PM IST
చంద్రబాబుకు బీజేపీ సపోర్ట్.. జగన్‌పై ఎటాక్
చంద్రబాబు
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బీజేపీ ఎటాక్ చేసింది. అయితే, ఆ వ్యాఖ్యలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉండడం విశేషం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. టీడీపీ హయాంలో చేపట్టిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, ప్రాజెక్టుల్లో అవినీతి జరిగిందని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోపిస్తోంది. దీనిపై నిజానిజాలను నిగ్గుతేల్చేందుకు కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. ఆ కమిటీల ఆధారంగా గత ప్రభుత్వంలో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తోంది. అయితే, జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబునాయుడు హయాంలో అవినీతి చేశారని ప్రకటనలు చేస్తోందే కానీ, రిపోర్టులు బయటపెట్టడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అలాగే, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను సమీక్షించేబదులు వాటిలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. దీంతోపాటు పోలవరం మీద జగన్ వైఖరిని కూడా తప్పుపట్టారు. పోలవరం కాంట్రాక్టర్ పనుల నుంచి తప్పుకోవాలంటూ జారీ చేసిన నోటీస్ మీద కూడా కన్నా స్పందించారు. టెండర్లను రద్దు చేసే జగన్ ప్రభుత్వం వాటిలో జరిగిన అవినీతిని బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

తెలుగుదేశం పార్టీ మీద జగన్ మోహన్ రెడ్డి సంధిస్తున్న అస్త్రాలకు చంద్రబాబునాయుడు కూడా ఇదే తరహాలో కౌంటర్ ఇస్తున్నారు. అవినీతి జరిగిందని జగన్ మోహన్ రెడ్డి చెబుతున్నారే కానీ, వాటికి ఆధారాలు చూపాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా అదే తరహాలో మాట్లాడడం విశేషం.

First published: August 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు