9 నెలల్లో రక్తం పీల్చిన జగన్... బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు

అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన నిరసనలు 75వ రోజు కొనసాగాయి. ఈ క్రమంలో కన్నా లక్ష్మీనారాయణ వారికి సంఘీభావం తెలిపారు.

news18-telugu
Updated: March 1, 2020, 6:17 PM IST
9 నెలల్లో రక్తం పీల్చిన జగన్... బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
ఏపీ సీఎం వైఎస్ జగన్
  • Share this:
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జగన్ తొమ్మిది నెలల పాలనలో రక్తం పీల్చడం తప్ప చేసింది శూన్యం అని వ్యాఖ్యానించారు. ‘పోలీసుల సాయంతో జగన్ పాలన కొనసాగుతోంది. పాదయాత్ర లో ఎన్నో మాటలు చెప్పి అధికారం లోకి వచ్చిన జగన్ చేసింది శూన్యం. 9 నెలల్లో ప్రజల రక్తం పీల్చుకుతినడం తప్ప చేసింది ఏమీ లేదు. జగన్ 9 నెలల పాలనలో రాష్ట్రం తొమ్మిదేళ్లు వెనక్కిపోయింది. జగన్ పాలన మొత్తం రద్దులు, కూల్చడాలతోనే సరిపోయింది. ఒక్క అభివృద్ది పనులకు కూడా పునాదిరాయి వేయలేదు. ప్రజల గోడు పట్టించుకునే ప్రజా ప్రతినిధే లేడు. గత టీడీపీ ప్రభుత్వం చేసిన వాటికి మించిన అరాచకాలు వైసీపీ చేస్తుంది.ప్రజా సమస్యలు పై గొంతు ఎత్తిన వారిపై తప్పుడు కేసులు పెట్టి వేదిస్తున్నారు.’ అని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ రైతులు చేపట్టిన నిరసనలు 75వ రోజు కొనసాగాయి. ఈ క్రమంలో కన్నా లక్ష్మీనారాయణ వారికి సంఘీభావం తెలిపారు. జగన్ మోహన్ రెడ్డి దురుద్దేశంతోనే మూడు రాజధానుల ప్రకటన చేశారని తప్పుపట్టారు. మహిళలు శ్రద్ధగా ఉద్యమం చేస్తున్నారని వారిని అభినందించారు. రైతులకు బీజేపీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Published by: Ashok Kumar Bonepalli
First published: March 1, 2020, 6:07 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading