జగన్, చంద్రబాబుపై బీజేపీ చీఫ్ కన్నా సెటైర్లు

ఏపీ సీఎం వైఎస్ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై తనదైన శైలిలో సెటైర్లు వేశారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ.

news18-telugu
Updated: August 17, 2019, 1:01 PM IST
జగన్, చంద్రబాబుపై బీజేపీ చీఫ్ కన్నా సెటైర్లు
జగన్, కన్నా, చంద్రబాబు
  • Share this:
ఏపీలోని చంద్రబాబు ఇంటిపై జరుగుతున్న రాజకీయంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ఈ అంశంలో పరస్పరం విమర్శలు చేసుకుంటున్న బీజేపీ, టీడీపీలను కన్నా టార్గెట్ చేశారు. రాష్ట్రంలో వరదల సమయంలో ప్రజల బాగోగులు అక్కరలేని సీఎం జగన్ మోహన్ రెడ్డి అమెరికా వెళ్లారని సెటైర్ వేసిన కన్నా లక్ష్మీనారాయణ... 5 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచినాయన 'కొంప మునిగి' హైదరాబాద్ జారుకున్నాడని పరోక్షంగా టీడీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై సెటైర్ వేశారు. వారిద్దరి 'తోక నేతలు'చేస్తున్న చర్చ"ఇల్లు మునిగిందా,లేదా"? అని వాదించుకోవడాన్ని తప్పుపట్టారు.


ఇల్లు సంగతి వదిలేయాలని... మీ రెండు పార్టీల వలన రాష్ట్రం నిండా మునుగుతోందని కన్నా లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ నాయకుల మధ్య జరుగుతున్న రాజకీయ విమర్శలతో అసలు సమస్యలు పక్కకు పోతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు అధికారికంగా స్పందించని బీజేపీ... తాజాగా ఇరు పార్టీలపై విమర్శలు వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది.


First published: August 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు