AP Bandh : టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా నేడు ఏపీ బంద్

చంద్ర‌బాబునాయుడు (ఫైల్ ఫోటో)

AP Bandh : టీడీపీ కార్యాలయాలపై దాడికి నిరసనగా బుధవారం ఏపీ బంద్‌కు టీడీపీ బంద్‌కు పిలుపు నిచ్చింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు బంద్‌కు పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని మండిపడ్డారు. ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

 • Share this:
  ఏపీ టీడీపీ ( ap tdp ) కార్యాలయాలపై దాడికి నిరసనగా టీడీపీ నేడు బంద్‌కు ( Bandh ) పిలుపునిచ్చింది. దాడులపై స్పందించిన టీడిపి ఆధినేత చంద్రబాబు నాయుడు ( Chndrababu naidu ) తీవ్రంగా ఖండించారు. కాగా మంగళవారం టీడీపీ కేంద్ర కార్యాలయంతో పాటు రాష్ట్రంలోని టీడీపీ కార్యాలయాలపై వైసీపీ శ్రేణులు ( ycp ) దాడి చేశారు.. అనంతరం టీడీపీ నేత పట్టాభి నివాసంలోనూ అరాచకం సృష్టించారు. విలువైన సామాన్లతో పాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు.

  దాడి అనంతరం చంద్రబాబు నాయుడు పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం మీడియాతో ( media )మాట్లాడిన చంద్రబాబు నాయుడు తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి.. ప్రభుత్వం, పోలీసులు కలసిచేసిన టెర్రరిజమని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రపతి పాలనకు నేను వ్యతిరేకం. కానీ ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయంతోనే దాడులు జరిగాయి. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారనేందుకు ఇంతకంటే తీవ్రమైన పరిస్థితులు ఏముంటాయంటూ ప్రశ్నించారు.. 356 అధికరణం ప్రయోగించి రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండు చేశారు.

  అయితే కార్యాలయలపై జరిగిన దాడులపై వివరించేందుకు ప్రయత్నించినా డీజీపీ ( DGP ) ఫోన్‌ తీయలేనంత తీరికలేకుండా ఉన్నారని ఆయన మండిపడ్డారు..తాము అత్యవసరం కాకుంటే ఎందుకు ఫోన్‌ చేస్తాం? డీజీపీ అపరాధి కాదా?’ అని నిలదీశారు. ఇక టీడిపి కార్యాలయలపై దాడులను ప్రజాస్వామ్యవాదులంతా ఖండించాలని అయన కోరారు... ఈ దాడికి నిరసనగా బంద్‌కు పలుపునిచ్చారు. కాగా తాను ఎప్పుడు బంద్‌లకు పిలుపునివ్వలేదని గుర్తు చేశారు. రాష్ట్ర బంద్‌ పాటించాలని కోరామంటే ప్రజలంతా అర్థం చేసుకోవాలని అన్నారు.బంద్‌కు సంపూర్ణ మద్దతూ ఇస్తూ.. ఏకపక్షంగా కార్యాలయాలు, విద్యాలయాలు మూసేసి నిరసన తెలపాలన్నారు.బంద్‌కు రాజకీయ పార్టీలూ కూడా మద్దతివ్వాలని విజ్ఞప్తి చేశారు.

  ఇది చదవండి : చెత్తలో పది తులాల బంగారం.. తిరిగి అప్పగించిన పారిశుద్ద్య కార్మికురాలు.


  విజయవాడలో పట్టాభి, హిందూపురంలో బాలకృష్ణ ఇంటిపై, కడపలో అమీర్‌బాబుతోపాటు విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు, నెల్లూరుల్లోనూ దాడులు జరిగాయి. శాంతిభద్రతల రక్షణలో విఫలమయ్యారనేందుకు ఇంతకంటే ఏం కావాలి అంటూ ఆయన ప్రశ్నించారు.. దీనిపై విచారణ చేయించాలని డిమాండు చేశారు.

  ఇది చదవండి  : హిందువులపై దాడులకు నేను సిగ్గుపడుతున్నాను..

  ఇంత పెద్ద ఎత్తున టీడిపీ కార్యాలయంపై దాడి జరుగుతుంటే డీజీపీకి తెలియలేదంటే ఆయన ఆ పదవికి తగినవారేనా? సంయమనం పాటించాలంటూ తెలివిగా మాట్లాడుతున్నారు. ప్రజలు చెల్లించే పన్నుల నుంచి జీతం తీసుకుంటున్న ఆయన.. మమ్మల్ని చంపే సమయంలో ఎక్కడున్నారు? ఎక్కడికి పోయారు? చేతనైతే శాంతిభద్రతలను రక్షించండి.. లేదంటే ఇంటికి పోండి అంటూ మండిపడ్డారు. దాడి జరుగుతోందని.. ఎంతమంది చనిపోతారో తెలియదని గవర్నర్‌కు ఫోన్‌లో వివరించా. నియంత్రించాలని కోరానని చెప్పారు కొందరి కారణంగా పోలీసువ్యవస్థ భ్రష్టు పట్టిందని విమర్శించారు.
  Published by:yveerash yveerash
  First published: