ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడిన ఆయన.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనకు మంచి స్నేహితుడు అని, ఆయనతో రాజకీయ వైరం తప్ప వ్యక్తిగత వైరం లేదని స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో విగ్రహాల తొలగింపుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. రాజశేఖర్ రెడ్డి విగ్రహాలంటే చంద్రబాబుకు కడుపు మంట అని, విజయవాడలో ఓ రోజు ఆ విగ్రహాన్ని చూసి ఓర్వలేక దాన్ని తొలగించిన మహానుభావుడు చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. నిజానికి, ఎవరికీ అడ్డం లేని చోట ఆ విగ్రహం ఉందని అన్నారు.
దీనిపై ప్రతిపక్ష నేత మాట్లాడుతూ.. ‘రాజశేఖర్ రెడ్డి నాకు బెస్ట్ ఫ్రెండ్. 1975 నుంచి 1983 వరకు మేమిద్దరం కలిసి ప్రయాణం చేశాం. రాజశేఖర్ రెడ్డి, నేను ఒకే గదిలో ఉండే వాళ్ళం. జగన్కు మా స్నేహం గురించి తెలియకపోవచ్చు. వైఎస్ఆర్తో రాజకీయ విభేదం తప్ప... వ్యక్తిగత వైరం లేదు. అలాంటిది విగ్రహాల తొలగింపుపై నేను ఎందుకు వేరేలా కోరుకుంటాను?’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
<blockquote class="twitter-tweet" data-lang="en"><p lang="te" dir="ltr">వైఎస్ రాజశేఖర్ రెడ్డికీ, నాకూ మధ్య రాజకీయ విరోధం తప్ప, ఎలాంటి వ్యక్తిగత విరోధం లేదు. మేమిద్దరం మంచి స్నేహితులం. <a href="https://t.co/7E1eXTiWYg">pic.twitter.com/7E1eXTiWYg</a></p>— N Chandrababu Naidu (@ncbn) <a href="https://twitter.com/ncbn/status/1151756075802042368?ref_src=twsrc%5Etfw">July 18, 2019</a></blockquote>
<script async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>
Published by:Shravan Kumar Bommakanti
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.