ఏపీ అసెంబ్లీ నుంచి 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఈ ఒక్క రోజుకు సభ నుంచి సస్పెండ్ చేశారు.

news18-telugu
Updated: January 20, 2020, 9:31 PM IST
ఏపీ అసెంబ్లీ నుంచి 17 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్...
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 17 మంది టీడీపీ ఎమ్మెల్యేలను ఈ ఒక్క రోజుకు సభ నుంచి సస్పెండ్ చేశారు. సభా నాయకుడు సీఎం జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతున్న సమయంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్దకు వెళ్లి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ‘జై అమరావతి.. జైజై అమరావతి. మూడు రాజధానులు వద్దు. ఒక్క రాజధాని ముద్దు’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పలుమార్లు వారిని కూర్చోవాలని సీఎం జగన్ కోరారు. అనంతరం పోడియం వద్ద గందరగోళం చేస్తున్న వారిని అక్కడి నుంచి పంపాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. జగన్ విజ్ఞప్తి చేసిన తర్వాత కూడా టీడీపీ ఎమ్మెల్యేలు పోడియం వద్ద నినాదాలు చేస్తూనే ఉన్నారు. దీంతో వారిని మార్షల్స్ సాయంతో బయటకు పంపాలంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కోరారు. అనంతరం కొద్దిసేపటి తర్వాత 17 మంది ఎమ్మెల్యేలను సభ నుంచి ఒక్క రోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్టు తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

తమ నిరసనల సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యేలు సభలో బిల్లు కాపీలను చించివేశారు. దీంతో మార్షల్స్ వచ్చి వారిని బయటకు తీసుకుని వెళ్లారు. అసెంబ్లీ లాబీల్లో కూడా టీడీపీ సభ్యులు జై అమరావతి అంటూ నినాదాలు చేశారు. మరోవైపు చంద్రబాబునాయుడు కూడా సభ నుంచి బయటకు వచ్చారు. టీడీపీ ఎమ్మెల్యేలతో కలసి అసెంబ్లీ లాబీలో బైఠాయించారు. టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు తీసుకుని వెళ్లడంలో మార్షల్స్ విఫలం అయ్యారంటూ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చీఫ్ మార్షల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు...

అచ్చెన్నాయుడు
కరణం బలరాం
భవాని
బుచ్చయ్య చౌదరిచినరాజప్ప
వెంకటరెడ్డి నాయుడు
వాసుపల్లి గణేష్
వి. జోగేశ్వరరావు
పయ్యావుల కేశవ్
గద్దె రామ్మోహన్ రావు
వెలగపూడి రామకృష్ణ బాబు
నిమ్మల రామానాయుడు
మంతెన రామరాజు
గొట్టిపాటి రవికుమార్
ఏలూరి సాంబశివరావు
అనగాని సత్యప్రసాద్
బాలవీరాంజేయ స్వామి
Published by: Ashok Kumar Bonepalli
First published: January 20, 2020, 9:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading