సభకు రానివ్వకుండా అడ్డుకుంటే.... ఏపీ స్పీకర్ తమ్మినేని హెచ్చరిక...

అసెంబ్లీకి వెళ్లే వారిని అడ్డుకున్నా, చట్టసభ సభ్యులు కాని వారు అసెంబ్లీ ప్రాంగణంలోకి వచ్చినా వారిని జైల్లో వేస్తామని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం హెచ్చరించారు.

news18-telugu
Updated: January 19, 2020, 5:33 PM IST
సభకు రానివ్వకుండా అడ్డుకుంటే.... ఏపీ స్పీకర్ తమ్మినేని హెచ్చరిక...
తమ్మినేని సీితారాం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానుల అంశానికి ఆమోద ముద్ర వేసేందుకు రేపు ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఈ నేపథ్యంలోనే అమరావతి పరిరక్షణ జేఏసీ తరఫున అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘చట్టసభలకు హాజరుకాకుండా నిరోధించడం రాజ్యాంగ విరుద్ధం. ఆందోళనకారులకు తమ నిరసన తెలుపుకొనే హక్కు ఉంటుంది. అయితే, అది నిబంధనలకు లోబడే ఉండాలి. చట్టసభ సభ్యులను సభకు రానివ్వకుండా అడ్డుకోవడం అంటే అది సభ్యుల హక్కులను హరించడమే. సభను నిర్వర్తించకుండా, ముట్టడికి పిలుపునివ్వడం అంటే సభ్యుల హక్కులను ఉల్లంఘించడమే. ఎవరైనా అలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడి, సభను అడ్డుకునే ప్రయత్నం చేస్తే వారిని జైలుకు పంపిన ఘటనలు గతంలో ఉన్నాయి.’ అని తమ్మినేని సీతారాం స్పష్టం చేశారు. సభ్యులు ఎవరైనా సమస్యను అసెంబ్లీలో ప్రశ్నించవచ్చని సూచించారు. శాసనసభ నిబంధనల ప్రకారం సభ్యులు కాని వారు అసెంబ్లీ ప్రాంగణంలోకి రాకూడదని స్పష్టం చేశారు. అలా కాదని ఎవరైనా ముందుకొస్తే జైల్లో వేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

First published: January 19, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు