వెంకయ్యనాయుడు చేసింది తప్పు.. ఏపీ స్పీకర్ ఘాటు వ్యాఖ్యలు..

ఫిరాయింపు ఎంపీలను ప్రోత్సహించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తప్పు చేశారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.

news18-telugu
Updated: August 4, 2019, 4:09 PM IST
వెంకయ్యనాయుడు చేసింది తప్పు.. ఏపీ స్పీకర్ ఘాటు వ్యాఖ్యలు..
తమ్మినేని సీితారాం
  • Share this:
ఫిరాయింపు ఎంపీలను ప్రోత్సహించి ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తప్పు చేశారని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. రాజ్యాంగ పదవిలో ఉప రాష్ట్రపతిగా, రాజ్యసభ చైర్మన్‌గా ఉన్న వెంకయ్యనాయుడు చేసింది ముమ్మాటికీ తప్పేనని సీతారాం స్పష్టం చేశారు. విజయవాడలో మీట్ ద ప్రెస్ కార్యక్రమానికి తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ప్రజాప్రతినిధుల ఫిరాయింపులపై విలేకరులు అడిగిన ఓ ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ‘ఈ ప్రశ్న నన్ను అడగాల్సింది కాదు. వెంకయ్యనాయుడును అడగాల్సింది. ఆయన చేసింది తప్పు. నైతికతను ప్రోత్సహించాల్సిందిపోయి.. అనైతికతను ప్రోత్సహించారు. విలువలతో కూడిన రాజకీయం కావాలి. దాన్ని వదిలేస్తే చాలా దూరం వెళ్తుంది. రాజ్యాంగ పరంగా ఉన్నతపదవుల్లో ఇలాంటి తప్పుడు పనులు చేయకూడదు.’ అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

చంద్రబాబునాయుడు విదేశాల్లో ఉన్న సమయంలో నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్, గరికపాటి రామ్మోహన్, టీజీ వెంకటేష్.. బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీని బీజేపీఎల్పీలో విలీనం చేస్తున్నట్టు ప్రకటిస్తూ ఓ లేఖను ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు సమర్పించారు. రాజ్యసభ చైర్మన్ కూడా అయిన వెంకయ్యనాయుడు వారి లేఖను ఆమోదించి వారిని బీజేపీ సభ్యులుగా పరిగణిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఆ తర్వాత రాజ్యసభ వెబ్‌సైట్‌లో కూడా ఈ మేరకు వెనువెంటనే మార్పులు జరిగిపోయాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఓ పార్టీ తరఫున రాజ్యసభకు నామినేట్ అయిన వారిని మరో పార్టీలో చేర్చుకోవడం, అది కూడా ఉప రాష్ట్రపతి అందుకు ఆమోదం తెలపడం వివాదానికి ఆస్కారం ఇచ్చింది.

First published: August 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>