• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP ASSEMBLY SPEAKER TAMMINENI SEETHARAM WIFE CONTESTING IN PANCHAYAT ELECTIONS BA

AP Panchayat Elections: ఎన్నికల చిత్రాలు.. ఏపీ స్పీకర్ భార్యకి, తోడి కోడలికి ‘పంచాయతీ’

AP Panchayat Elections: ఎన్నికల చిత్రాలు.. ఏపీ స్పీకర్ భార్యకి, తోడి కోడలికి ‘పంచాయతీ’

ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం(ఫైల్ ఫొటో)

ఏపీలోని పంచాయతీ ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుపొంది మరో సారి తమ సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు తమ ఉనికిని చాటుకునేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి.

  • Share this:
    ఏపీలోని పంచాయతీ ఎన్నికలు సర్వత్రా ఆసక్తికరంగా మారాయి. ఈ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుపొంది మరో సారి తమ సత్తా చాటాలని వైసీపీ భావిస్తోంది. మరోవైపు తమ ఉనికిని చాటుకునేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూడా పోటీ పడుతున్నాయి. ఇదే తరుణంలో ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం భార్య సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయడం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఆమెకు పోటీగా తెలుగుదేశం పార్టీ నుంచి సీతారామ్ అన్న శ్యామల్రావు భార్య భారతి పోటీ చేస్తూ ఉండడం ఉత్కంఠ రేపుతుంది. ఇకపోతే తన భార్య ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు గాను, తన అన్నభార్యను నామినేషన్ వేయకుండా అడ్డుపడుతున్నారని టీడీపీ నేత కూన రవికుమార్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఎలా అయినా తన భార్య సర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నిక కావాలని ఆయన అన్న భార్య అని కూడా చూడకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం మీద ఈ నామినేషన్ రాజకీయంగా ఆసక్తిగా మారింది.

    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్ కొనసాగుతోంది. మొదటి దశ ఎన్నికల పోలింగ్ లో భాగంగా రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 2,723 గ్రామ పంచాయతీల్లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాల్లో 7,506 మంది... 20,157 వార్డులకు 43,601 మంది పోటీలో నిలిచారు. ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుండగా కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలో చోటు చేసుకుంటున్నాయి. కృష్ణాజిల్లా విజయవాడ రూరల్ మండలం నిడమానూరు పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు వింత అనుభవం ఎదురైంది. గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 5వ నంబర్ పోలింగ్ బూత్ వద్ద సర్పంచ్ అభ్యర్థి శీలం రంగారావుకు చెందిన ఎన్నికల గుర్తు మాయమైంది. బ్యాలెట్ పేపర్లో శీలం రంగారావుకు కేటాయించిన వంకాయ గుర్తు స్థానంలో అధికారులు నోటా గుర్తు స్టిక్కర్ అంటించారు.

    పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతున్నా... అక్కడక్కడా ఊళ్లలో ఘర్షణలు జరుగుతున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు మండలం చినజగ్గంపేటలో రెండు వర్గాల మధ్య మాటామాట పెరిగింది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ విరుచుకుపడ్డారు. చివరకు కత్తులతో దాడులకు దిగడంతో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇదంతా ఎన్నికల కారణంగానే జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇక ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. డబ్బు ఇస్తున్న కొందరిని ఊరి ప్రజలు అడ్డుకున్నారు. అటు చిత్తూరు జిల్లా బొట్లవారిపల్లెలో అర్ధరాత్రి వైసీపీ మద్దతుదారులు దాడులకు దిగినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. పోలీసులు ఎంటరవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

    (Source: Suryaepaper)
    First published:

    అగ్ర కథనాలు