‘వికేంద్రీకరణ బిల్లు’లపై స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: August 7, 2020, 3:12 PM IST
‘వికేంద్రీకరణ బిల్లు’లపై స్పీకర్ తమ్మినేని కీలక వ్యాఖ్యలు
ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులకు సంబంధించి స్పీకర్ తమ్మినేని సీతారాం కీలక వ్యాఖ్యలు చేశారు. వికేంద్రీకరణ బిల్లులపై సభలో 11 గంటల పాటు చర్చించామన్నారు. అందులో ప్రతిపక్ష పార్టీకి కూడా 2.17 గంటల పాటు సమయం ఇచ్చామన్నారు. టీడీపీ సంఖ్యాబలం కంటే కూడా వారికి ఎక్కువ సమయం ఇచ్చామన్నారు. అలాంటిది, అసలు బిల్లులపై చర్చ జరగలేదని టీడీపీ అనడం సరికాదన్నారు. అయినా, అసెంబ్లీ తీసుకునే నిర్ణయాలపై కోర్టుల జోక్యం చేసుకోరాదని, 1997 సంవత్సరంలో అసెంబ్లీ స్పీకర్‌గా ఉన్నప్పుడు యనమల రామకృష్ణుడు రూలింగ్ ఇచ్చారని, ఇప్పుడు అసెంబ్లీలో జరిగిన చర్చపై కోర్టులెలా జోక్యం చేసుకుంటాయని ప్రశ్నించారు.

ప్రభుత్వం నుంచి ప్రతినిధులుగా వెళ్లిన మంత్రులను మండలికి రాకూడదనడం ఎంతవరకు సమంజసమని తమ్మినేని ప్రశ్నించారు. రాజధాని వికేంద్రీకరణ, సీఆర్డీఏ బిల్లులు సెలక్ట్ కమిటీలో ఉన్నాయంటూ కొందరు కోర్టుకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని తమ్మినేని అన్నారు. అసలు సెలక్ట్ కమిటీ ఏర్పాటు కానప్పుడు పెండింగ్‌లో ఎలా ఉంటాయని ప్రశ్నించారు. సెలక్ట్ కమిటీకి పంపాలంటే కచ్చితంగా ఓటింగ్ జరగాలని, అలా జరగనప్పుడు సెలక్ట్ కమిటీ ఎలా ఏర్పాటు అవుతుందని ప్రశ్నించారు. సెలక్ట్ కమిటీకి పంపాలని శాసనసభలో చంద్రబాబు ఎందుకు అడగలేదని తమ్మినేని నిలదీశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 7, 2020, 3:12 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading