ఏపీ అసెంబ్లీలో ఇవాళ్టి కొన్ని సరదా సన్నివేశాలు... తొడగొట్టిన ఘటనలు...

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగానే కాదు. మధ్యమధ్యలో సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి.

news18-telugu
Updated: January 20, 2020, 2:19 PM IST
ఏపీ అసెంబ్లీలో ఇవాళ్టి కొన్ని సరదా సన్నివేశాలు... తొడగొట్టిన ఘటనలు...
ఏపీ స్పీకర్ తమ్మినేని సీితారాం
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగానే కాదు. మధ్యమధ్యలో సరదా సన్నివేశాలు కూడా చోటుచేసుకున్నాయి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ప్రారంభం కాగానే సభలోకి వచ్చిన అధికార వైసీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారామ్ కు గుడ్ మార్నింగ్ చెప్పగా.. టీడీపీ సభ్యులు మాత్రం బ్యాడ్ మార్నింగ్ చెప్పారు. దీనిపై స్పందించిన స్పీకర్ తమ్మినేని సభాపతి అన్న గౌరవం కూడా లేకుండా బ్యాడ్ మార్నింగ్ చెబుతున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.

ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రసంగం సమయంలో ఇన్ సైడర్ ట్రేడింగ్ జాబితా చదువుతూ వివరాలన్నీ చదవాలంటే చాలా సమయం పడుతుంది, నీళ్లు తాగుతా అంటే, స్పీకర్ తమ్మినేని ... ‘మీరు తాగితే తాగండి కానీ మాతో నీళ్లు తాగించకండి’ అన్నారు. దీంతో సభలు నవ్వులు వినిపించాయి
.

ఆర్ధిక మంత్రి బుగ్గన అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వివరాలు వెల్లడిస్తూ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి పేరు ప్రస్తావించారు. ఆయన బినామీలు రాజధాని ప్రకటనకు ముందే అమరావతిలో భూములు కొన్నారని బుగ్గన చెప్పారు. దీంతో సీట్లో నుంచి లేచి ఆగ్రహం వ్యక్తం చేసిన బుచ్చయ్య చౌదరి.. ఆరోపణలు నిరూపించాలని తొడగొట్టి సవాల్ విసిరారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడంతో ఆయన స్పీకర్ పోడియంలోకి వెళ్లి ఆయనకు ఫిర్యాదు చేశారు.అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు సభ్యులంతా హాజరుకావాలని టీడీపీ విప్ జారీ చేయడంతో చాలా కాలం తర్వాత 23 మంది సభ్యులు కనిపించారు. ఇందులో ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాస్, గొట్టిపాటి రవికుమార్, పయ్యావుల కేశవ్ వంటి వారు గత సమావేశాల్లో కనిపించలేదు. టీడీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీమోహన్, మద్దాలి గిరిధర్ కూడా టీడీపీ సభ్యులతో కలిసి కూర్చున్నారు.
First published: January 20, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు