హోమ్ /వార్తలు /రాజకీయం /

AP Assembly: ఏపీ అసెంబ్లీలో మూడో రోజూ 9 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

AP Assembly: ఏపీ అసెంబ్లీలో మూడో రోజూ 9 మంది టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్

స్పీకర్ తమ్మినేని సీతారాం

స్పీకర్ తమ్మినేని సీతారాం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో మూడో రోజు 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ తమ్మినేని సీతారాం నిర్ణయం తీసుకున్నారు.

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో మూడో రోజు కూడా వాడి వేడిగా జరిగింది. అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధం కొనసాగింది. దీంతో 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. పోలవరంపై చర్చ జరుగుతుంటే, విపక్ష సభ్యులు అడ్డుకుంటున్నారని, ప్రభుత్వం వాదనను బయటకు వెళ్లనివ్వకుండా చేస్తున్నారని అధికార వైసీపీ ప్రతిపాదించింది. దీనికి సభ ఆమోదం తెలపడంతో స్పీకర్ తమ్మినేని సీతారాం 9 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో వరుసగా మూడో రోజు టీడీపీ ఎమ్మెల్యేల మీద సస్పెన్షన్ వేటు పడింది. ఈ రోజు పోలవరం అంశంపైచర్చ జరిగింది. ఈ సందర్భంగా పోలవరం ప్రాజెక్టు మీద అధికార విపక్షాల మీద వాగ్యుద్ధం జరిగింది. పోలవరం ప్రాజెక్టును తాము 70 శాతానికి పైగా పూర్తి చేశామని ప్రతిపక్ష టీడీపీ వాదించింది. అయితే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలోనే కాలువలు పూర్తి చేశారని, భూసేకరణ కూడా పూర్తి చేశారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. మొత్తంగా 2014 నుంచి 2019 మధ్య టీడీపీ హయాంలో పోలవరంలో 14 శాతం పనులు మాత్రమే అయ్యాయని జగన్ అన్నారు. దీంతో పాటు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలువలు పూర్తి చేసి ఉండకపోతే, పట్టిసీమ ఎలా పూర్తయ్యేదని జగన్ వాదించారు.

సీఎం జగన్ సభను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ టీడీపీ ఆరోపించింది. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియం వద్ద నిరసనకు దిగారు. స్పీకర్ పోడియం ఎదుట ఆందోళన చేస్తుండగా వారిని సభ నుంచి బయటకు పంపాలని, ప్రభుత్వం చెప్పే వాదనను బయటకు వెళ్లనివ్వకుండా వారు అడ్డుకుంటున్నారని జగన్ సూచించారు. అనంతరం శాసనసభాపక్ష నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సస్పెన్షన్ తీర్మానాన్ని ప్రతిపాదించారు. అది ఆమోదం పొందడంతో 9 మందిపై వేటు పడింది.

సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు

కె. అచ్చెన్నాయుడు

రామానాయుడు

రవికుమార్

బాలవీరాంజనేయస్వామి

బి.జోగేశ్వరరావు

రామకృష్ణబాబు

బెందాళం అశోక్

అనగాని సత్యప్రసాద్

ఏలూరి సాంబశివరావు

తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చాలా గందరగోళం చేస్తే తాము వచ్చి అంతా క్లీన్ చేస్తున్నామని జగన్ అన్నారు. ‘వారు పెంట పెడితే మేం వచ్చి క్లీన్ చేస్తున్నాం. కేంద్రంతో పోలవరం మీద పలుమార్లు చర్చించాం. కేంద్రం కూడా సానుకూలంగా ఉంది. మా ఆర్థిక మంత్రిని కేంద్రానికి పంపి నిర్మలా సీతారామన్‌కు పలుమార్లు విజ్ఞప్తి చేశాం. ఈ ప్రాజెక్టు (పోలవరం) ఒక్క అంగుళం కూడా ఎత్తు తగ్గించం. దీన్ని స్పష్టం చేస్తున్నా. నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. పోలవరం ప్రాజెక్టును 45.72 మీటర్లు కచ్చితంగా కట్టి తీరుతాం.’ అని జగన్ స్పష్టం చేశారు. 2022 ఖరీఫ్ సీజన్ నాటికి నీటిని అందిస్తామని సీఎం జగన్ సభలో ప్రకటించారు.

First published:

Tags: Andhra Pradesh, Ap assembly sessions, AP Speaker Tammineni Seetharam, Polavaram, Tdp

ఉత్తమ కథలు