మద్యపానంపై ఉక్కుపాదం.. దశల వారీగా నిషేధం: గవర్నర్ నరసింహన్

Andhra Pradesh Assembly Session | Governor ESL Narasimhan Speech: ఎన్నో కుటుంబాలను మద్యం ఛిన్నాభిన్నం చేస్తోందని, ఈ సమస్యను అధిగమించేందుకు దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని అన్నారు. తొలుత రాష్ట్రంలోని అన్ని బెల్టు షాపులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: June 14, 2019, 10:07 AM IST
మద్యపానంపై ఉక్కుపాదం.. దశల వారీగా నిషేధం: గవర్నర్ నరసింహన్
భారత్‌లో తయారైన విదేశీ మద్యం 180 ఎంఎల్ మీద రూ.60
  • Share this:
ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తామని నవరత్నాల్లో ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసేందుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించారు. అయితే, ఈ రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో మద్యపానంపై నిషేధం విధిస్తామని, అది తమ ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. ఎన్నో కుటుంబాలను మద్యం ఛిన్నాభిన్నం చేస్తోందని, ఈ సమస్యను అధిగమించేందుకు దశల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని అన్నారు. తొలుత రాష్ట్రంలోని అన్ని బెల్టు షాపులను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా చూస్తామన్నారు. కుల, మత, రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అవినీతి రహిత పాలనలో దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తామన్నారు. అందుకే ఏపీలోకి సీబీఐని అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. టెండర్ల ప్రక్షాళనకు జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అవసరమైతే రివర్స్ టెండరింగ్ విధానం తీసుకొస్తామన్నారు. టెండర్ల ప్రక్రియలో జరిగిన లోపాలను సరిదిద్దుతామని చెప్పారు.

కాగా, ఇంతకుముందు సీఎం జగన్ కూడా మద్యపాన నిషేధం గురించి అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుకు చర్యలు తీసుకోవాలని అధికారుల్ని ఆదేశించారు. దీనికి ఎలాంటి కార్యాచరణ చేపట్టాలో అన్వేషించాలని అధికారుల్ని సూచించారు. మద్యపానాన్ని నిరుత్సాహపరిచేలా కార్యాచరణ ఉండాలని చెప్పారు. గొలుసు దుకాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: June 14, 2019, 10:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading