అచ్చెన్న Vs బుగ్గన.. అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ మాటల యుద్దం..

టీడీపీ హయాంలో పట్టిసీమ ప్రాజెక్టులో తీవ్ర అవినీతి జరిగిందన్నారు ఆర్థికమంత్రి బుగ్గన. కాగ్ నివేదికలోనూ ఆ విషయం బయటపడిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో గ్రామ కమిటీలు తీవ్రంగా రెచ్చిపోయాయని.. అప్పటి అవినీతి అంతా ఇంతా కాదని ఆరోపించారు.

news18-telugu
Updated: June 17, 2019, 11:14 AM IST
అచ్చెన్న Vs బుగ్గన.. అసెంబ్లీలో టీడీపీ-వైసీపీ మాటల యుద్దం..
అచ్చెన్నాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి
news18-telugu
Updated: June 17, 2019, 11:14 AM IST
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై వాడీ వేడి చర్చ జరిగింది.మానవ, భౌతిక వనరుల దుర్వినియోగం రాష్ట్రం దుస్థితిని మరింత తీవ్రతరం చేసిందన్న గవర్నర్ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.టీడీపీ హయాంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ది చెందిందని ఆ పార్టీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు అన్నారు.రాష్ట్రం అభివృద్దిలో ఉందని ప్రధాని మోదీ స్వయంగా జగన్‌తో చెప్పారని అన్నారు.చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు మాసాల్లో విద్యుత్ సమస్యను పరిష్కరించారని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు జగన్ హయాంలో పవర్ కట్స్ మామూలైపోయాయని విమర్శించారు.

అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఘాటుగా స్పందించారు. 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రంలో విద్యుత్ సమస్య పరిష్కారమైందనడం సరికాదన్నారు.దేశవ్యాప్తంగా ఇంధన ధరలు, బొగ్గు ధరలు తగ్గినందువల్ల ఆనాడు అదనపు ఉత్పత్తి సాధ్యపడి దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సమస్యలు పరిష్కారమయ్యాయని అన్నారు.టీడీపీ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.10వేల కోట్లు బకాయి పడిందని.. అప్పులు చేయడం సులువని, కానీ ఇప్పుడు దాన్ని తీర్చాల్సిన బాధ్యత తమపై ఉందని పేర్కొన్నారు.పోలవరం ప్రాజెక్టును ఇంకో ఆర్నెళ్లలో పూర్తి చేయాలన్న టీడీపీ డిమాండ్‌ను ఆయన తప్పు పట్టారు. ఇప్పటివరకు ఇంకా భూసేకరణే పూర్తి కాని ప్రాజెక్టును ఆర్నెళ్లలో పూర్తి చేయాలని డిమాండ్ చేయడం సరికాదన్నారు.

టీడీపీ హయాంలో పట్టిసీమ ప్రాజెక్టులో తీవ్ర అవినీతి జరిగిందన్నారు. కాగ్ నివేదికలోనూ ఆ విషయం బయటపడిందన్నారు. టీడీపీ ప్రభుత్వంలో గ్రామ కమిటీలు తీవ్రంగా రెచ్చిపోయాయని.. అప్పటి అవినీతి అంతా ఇంతా కాదని ఆరోపించారు. అభివ‌ృద్ది అంటే కేవలం సిమెంట్ రోడ్లు వేయడం మాత్రమే కాదని విమర్శించారు. కొత్తగా అధికారంలోకి వచ్చిన తమ ప్రభుత్వం కొంత సమయం తీసుకుని అన్ని రకాల అభివృద్ది కార్యక్రమాలను చేపడుతుందన్నారు.First published: June 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...