సెలక్ట్ కమిటీ ఫైల్స్ రెండోసారి వెనక్కి... టీడీపీ నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?

మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు మరోసారి ఈ రెండు బిల్లుల అంశం ఉభయసభలను కుదిపేయనుంది.

news18-telugu
Updated: February 14, 2020, 10:30 PM IST
సెలక్ట్ కమిటీ ఫైల్స్ రెండోసారి వెనక్కి... టీడీపీ నెక్ట్స్ ప్లాన్ ఇదేనా?
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
రాజధాని వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ రద్దు బిల్లుల విషయంలో సెలక్ట్ కమిటీ ఏర్పాటు సాధ్యం కాదంటూ అసెంబ్లీ కార్యదర్శి ఆ ఫైల్‌ను రెండోసారి వెనక్కి పంపారు. కొన్ని రోజుల క్రితం కూడా ఇలాగే ఫైల్‌ను వెనక్కి పంపారు. అయితే, చైర్మన్ షరీఫ్ మరోసారి ఆ ఫైల్‌ను కార్యదర్శికి పంపి కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కానీ, రెండోసారి కూడా ఫైల్‌ను వెనక్కి పంపారు. నిబంధనల ప్రకారం సెలక్ట్ కమిటీ ఏర్పాటు చేయలేమని ఆ ఫైల్ మీద నోట్ రాశారు. అయితే, దీని మీద టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. శాసనమండలికి సంబంధించి చైర్మన్ సుప్రీం అని ఆయన చెప్పినట్టు చేయాల్సిన బాధ్యత అధికారులకు ఉంటుందని శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు చెప్పారు. చైర్మన్ పంపిన ఫైల్‌ను తిరిగి వెనక్కి పంపించడం అంటే నియమాలను ఉల్లంఘించడమేనని, దీనిపై సభ్యులు ఎవరైనా ఆ అధికారి మీద నోటీస్ ఇవ్వొచ్చని చెప్పారు. పార్టీ పరంగా కూడా ఏం చేయాలని చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

అసెంబ్లీ సెక్రటరీని కలిసిన ఏపీ టీడీపీ ఎమ్మెల్సీలు (File)


మార్చి 15 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అప్పుడు మరోసారి ఈ రెండు బిల్లుల అంశం ఉభయసభలను కుదిపేయనుంది. యనమల రామకృష్ణుడు చెప్పిన దాని ప్రకారం చూస్తే బడ్జెట్ సమావేశాల సందర్భంగా చైర్మన్‌ పంపిన ఫైళ్లను వెనక్కి పంపిన అధికారి మీద టీడీపీ ఎమ్మెల్సీ నోటీస్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతోపాటు న్యాయపరంగా కూడా ముందుకు వెళ్లాలని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు