గవర్నర్ కోర్టులో మూడు రాజధానుల బిల్లు..

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఆసక్తిగా మారింది.

news18-telugu
Updated: July 18, 2020, 2:42 PM IST
గవర్నర్ కోర్టులో మూడు రాజధానుల బిల్లు..
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (File)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ వద్దకు చేరాయి. నెల రోజుల క్రితం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ రెండు బిల్లులను ఏపీ అసెంబ్లీలో రెండోసారి ఆమోదించి వాటిని శాసనమండలికి పంపారు. వాటిని శాసనమండలి ఆమోదించలేదు. నిబంధనల ప్రకారం అసెంబ్లీ నుంచి వచ్చిన బిల్లు నెల రోజులు గడిచింది కాబట్టి దాన్ని ఆమోదించాల్సిందిగా అసెంబ్లీ అధికారులు గవర్నర్ ఆమోదం కోసం రాజ్ భవన్‌కు పంపారు. అయితే, గతంలో ఈ బిల్లులను శాసనమండలి సెలక్ట్ కమిటీకి పంపిందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ ఎమ్మెల్సీ యనమల కీలక వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ, CRDA రద్దు బిల్లులు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయన్న యనమల.... వాటిపై మండలి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. బిల్లుల్ని ఆమోదించడమో, వ్యతిరేకించడమో చెయ్యాలన్నారు. దీనిపై ప్రజాభిప్రాయం తీసుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న యనమల... రాష్ట్ర ప్రజలు మాత్రం మాత్రం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.

ap new governor,ap governor,new governors of ap and telangana,new governor,new governor of ap,ap news,ap new governor biswabhusan harichandan,governor,new governor to ap,governor of ap,ap new governor 2019,ap governor biswa bhusan harichandan,ap latest news,telangana new governor,governor narasimhan in ap,new governor in ap,andhra pradesh governor,new governor for ap,ap state new governor,ఏపీ కొత్త గవర్నర్, ఏపీ గవర్నర్, హరిచందన్, విశ్వభూషణ్, ఏపీ గవర్నర్ ప్రమాణం, ప్రమాణ స్వీకారం,
గవర్నర్ హరిచందన్‌తో సీఎం జగన్ (File)


కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజలు రాజధానిగా అమరావతిని కోనసాగించాలని కోరుతున్నా... మిగతా జిల్లాల ప్రజల్లో అభిప్రాయం అలా లేదని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అందువల్ల టీడీపీ నేతల మాటల్ని తాము పట్టించుకునేది లేదంటున్నారు. అన్ని ప్రాంతాలను అభివృద్ది చేయడానికి తాము సంకల్పిస్తే.. టీడీపీ ఎందుకు అడ్డుకుంటోందని మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. టీడీపీ నేతలకు అమరావతిలో తమ భూములు, పెట్టుబడుల మీదే ఆశ ఉందన్నారు.

ap mlc, ap legislative council, ap mlc news, tdp vs yrscp in council, ఏపీ వార్తలు, ఏపీ శాసనమండలి, సీఆర్డీఏ రద్దు, మూడు రాజధానుల బిల్లు
ఏపీ అసెంబ్లీ భవనం


ప్రస్తుతం ఈ అంశం రాజ్ భవన్‌కు చేరింది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నిర్ణయం మీద ఆధారపడి ఉంది. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అని ఆసక్తిగా మారింది. ఈ అంశంపై నాన్చుడు ధోరణి అవలంభిస్తారా? లేకపోతే వెంటనే ఆమోదం తెలుపుతారా? లేకపోతే న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని ఓ నిర్ణయం తీసుకుంటారా? అనే చర్చ జరుగుతోంది.
Published by: Ashok Kumar Bonepalli
First published: July 18, 2020, 2:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading