రూ.28866 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్..

AP Budget | రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌‌ను మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు.

news18-telugu
Updated: July 12, 2019, 2:44 PM IST
రూ.28866 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్..
ఏపీ అసెంబ్లీలో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న బొత్స సత్యనారాయణ (Screen Grab)
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2,27,975కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, వ్యవసాయ బడ్జెట్‌ను ప్రత్యేకంగా ప్రవేశపెట్టారు. రూ.28,866.23 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌‌ను మంత్రి బొత్స సత్యనారాయణ సభలో ప్రవేశపెట్టారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. రైతు భరోసా, ధరల స్థిరీకరణ నిధులకు భారీగా కేటాయింపులు జరిపారు. అక్టోబర్ 15 నుంచి రైతులకు పెట్టుబడి సాయం అందించనుంది. వ్యవసాయానికి పగటిపూట ఉచితంగా 9 గంటల నాణ్యమైన విద్యుత్ ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని బొత్స సత్యనారాయణ చెప్పారు. ఇప్పటికే 60 శాతానికి సంబంధించి చర్యలు తీసుకోగా, మరో 40 శాతం భూములకు సంబంధించి ఉచిత విద్యుత్ అందించడానికి రూ.1700 కోట్లు ఖర్చు అవుతుందన్నారు.

వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి రూ.8,750 కోట్లు
ధరల స్థిరీకరణ నిధికి రూ.3000 కోట్లు

వైఎస్ఆర్ రైతు బీమాకు రూ.100 కోట్లు
జాతీయ ఆహార భద్రత మిషన్‌కు రూ.141 కోట్లు


ఉచిత పంటల బీమా పథకానికి రూ. 1163 కోట్లు
వ్యవసాయ యాంత్రీకరణకు రూ.460 కోట్లుఉద్యానవన శాఖకు రూ.1532 కోట్లు
పశు సంవర్ధక శాఖకు రూ. 1220 కోట్లు

జీరో బడ్జెట్ వ్యవసాయానికి రూ.91 కోట్లు
పొలం బడికి రూ.89 కోట్లు
పశు ఆరోగ్య సంరక్షణకు రూ.73కోట్లు
విపత్తు నిర్వహణ నిధికి రూ.2002 కోట్లు
పౌల్ట్రీ రైతులకు వడ్డీ మాఫీ పథకం కింద రూ.50 కోట్లు
First published: July 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>