Kodela | కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు

Heart Attack to Kodela | ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు వచ్చింది. ఆయన్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు.

news18-telugu
Updated: August 24, 2019, 12:52 AM IST
Kodela | కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు.. ఆస్పత్రికి తరలింపు
కోడెల శివప్రసాదరావు (File)
news18-telugu
Updated: August 24, 2019, 12:52 AM IST
ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుకు గుండెపోటు వచ్చింది. ఆయన్ను కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించారు. శివప్రసాదరావును గుంటూరులోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. దీంతో గుంటూరు, విజయవాడ నుంచి ప్రముఖ వైద్యులు ఆస్పత్రికి చేరుకుని చికిత్స అందిస్తున్నారు. ఓ దశలో కోడెలను గుంటూరు నుంచి హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించాలని భావించారు. అయితే, నిపుణులైన వైద్యులు వచ్చారు. దీంతో ట్రీట్‌మెంట్‌ను బట్టి తర్వాత నిర్ణయం తీసుకోనున్నారు. గతంలో కోడెల శివప్రసాదరావుకు ఓ సారి గుండెపోటు వచ్చింది. అప్పుడు చికిత్స చేసిన వైద్యులు స్టెంట్ అమర్చారు. కోడెలకు హార్ట్ ఎటాక్ రావడం ఇది రెండోసారి. కోడెలకు హార్ట్ ఎటాక్ వచ్చిందని తెలిసిన వెంటనే తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, ఆయన అనుచరులు వెంటనే ఆయన చికిత్స పొందుతున్న ఆస్పత్రి వద్దకు తరలివచ్చారు. కోడెల ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు.

గత కొన్ని రోజులుగా ఆయన ఓ తీవ్ర దుమారంలో చిక్కుకున్నారు. హైదరాబాద్‌లో అసెంబ్లీ నుంచి అమరావతికి తరలించాల్సిన సామగ్రిని తన సొంత ఇంటికి, తన కుమారుడి షోరూమ్‌కి తరలించారని ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆయన కూడా అంగీకరించారు. ఆఫీసులో స్థలం లేకపోవడం వల్ల తన వద్ద భద్రపరిచానని, కావాలంటే తీసుకుని వెళ్లొచ్చనికూడా చెప్పారు. ఓ స్పీకర్‌గా పనిచేసిన ఆయన ఇలా కుర్చీలు, బెంచీలు, సోఫాలు, డైనింగ్ టేబుల్స్ ఇంటికి తీసుకుని వెళ్లడం రాజకీయాల్లో పెనుదుమారానికి దారితీసింది. కోడెల చేసిన పని తప్పు అంటూ ఆ పార్టీ నేతలు కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో నిన్న రాత్రి కోడెల నివాసంలోకి కొందరు యువకులు చొరబడి కంప్యూటర్లను ఎత్తుకెళ్లారు. అయితే, ఆ వ్యక్తి వైసీపీ కార్యాలయంలో పనిచేసే వాడని, అంబటి రాంబాబే తన మీదకు పంపారని కోడెల ఆరోపించారు. అయితే, ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఆ వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు 2018లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నుంచి 30 ల్యాప్‌టాప్‌లు తీసుకెళ్లారంటూ కోడెల మీద క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. నరసరావుపేట పోలీసులు ఈ కేసును విచారిస్తున్నారు.

కోడెలను చేర్చిన శ్రీలక్ష్మీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి (File)


తెలుగుదేశం పార్టీలోని సీనియర్ నాయకుల్లో కోడెల కూడా ఒకరు. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనపై భారీ ఎత్తున విమర్శల వెల్లువ వచ్చింది. కోడెలతో పాటు ఆయన కుమార్తె, కుమారుడి ఆగడాలు హెచ్చరిల్లాయంటూ చాలా మంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారంటూ ఒకరు, భూ వివాదంలో మరొకరు.. ఇలా రకరకాలైన ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో కోడెల ఒత్తిడికి గురై ఉంటారని బంధువులు భావిస్తున్నారు.

First published: August 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...