గెలుపు మాదే..చంద్రబాబుకు ఓటమి భయం..సిగ్గుతో తలదించుకోవాలన్న జగన్

వైఎస్ జగన్

85 శాతం ప్రజలు పోలింగ్‌లో పాల్గొన్నారని.. అలాంటప్పుడు రీపోలింగ్ అవసరమేంటని ప్రశ్నించారు జగన్. భారీగా పోలింగ్ నమోదుకావడం తమకు కలిసి వస్తుందన్నారు.

 • Share this:
  ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీని బెదిరిస్తున్నారని వైసీపీ జగన్ మండిపడ్డారు. పోలింగ్ పూర్తయిన అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. రీపోలింగ్ నిర్వహించాలన్న ఆయన డిమాండ్‌ను తప్పుబట్టారు. 85 శాతం ప్రజలు పోలింగ్‌లో పాల్గొన్నారని.. అలాంటప్పుడు రీపోలింగ్ అవసరమేంటని ప్రశ్నించారు జగన్. భారీగా పోలింగ్ నమోదుకావడం తమకు కలిసి వస్తుందన్నారు. భారీ మెజార్టీతో ప్ర్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ధీమా వ్యక్తంచేశారు వైసీపీ అధినేత.

  ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీని బెదిరిస్తున్నారు. ఓటమి ఖాయమైందని తెలిశాక ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు కుట్ర చేశారు. తనను తాను రక్షించుకునేందుకు నీచస్థాయికి దిగజారారు. ఏపీలో అరాచకాలు సృష్టించేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. మంగళగిరిలో లోకేశ్ ఎన్నికల నియామవాళిని ఉల్లంఘించారు. అనుచరులతో కలిసి పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లారు. టీడీపీ నేతలు పోలింగ్ సిబ్బందిని కూడా బెదిరించారు. ఎన్నికల్లో ఓటింగ్ శాతం తగ్గించేందుకు చంద్రబాబు కుట్రలు చేశారు. తాను చేసిన పనికి సిగ్గుతో తలదించుకోవాలి. దేవుడి దయ వల్ల 80శాతం ప్రజలు ఓట్లేశారు. ఇది ప్రజల విజయంం.
  వైఎస్ జగన్


  వైసీపీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు జగన్. టీడీపీ శ్రేణుల దాడుల్లో కొంత మందికి గాయాలయ్యాయని..ఇద్దరు వైసీపీ కార్యకర్తల ప్రాణాలు పోయాయని చెప్పారు. వారి కుటుంబాలకు వైసీపీ అండగా ఉంటుందన్నారు జగన్. చంద్రబాబుకు కేసీఆర్ ఇస్తామన్న రిటర్న్ గిఫ్ట్‌తో తనకు సంబంధం లేదని స్పష్టంచేశారు.

  First published: