కోటి మందికి ఉచిత స్మార్ట్‌ఫోన్లు, సిలిండర్లు..చంద్రబాబు బంపర్ ఆఫర్

ప్రకాశం జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఐటీ దాడులకు భయపడి వైసీపీలోకి వెళ్లిపోయారని విమర్శించారు. ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ శిద్దారాఘవరావును భారీ మెజార్టీతో గెలింపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు చంద్రబాబు.

news18-telugu
Updated: April 4, 2019, 5:30 PM IST
కోటి మందికి ఉచిత స్మార్ట్‌ఫోన్లు, సిలిండర్లు..చంద్రబాబు బంపర్ ఆఫర్
చంద్రబాబు
  • Share this:
ఎన్నికలవేళ ఓటర్లపై హామీల వర్షం కురుస్తోంది. ఉచితాల పేరిట జనాలను ఊరిస్తున్నాయి పార్టీలు. బంపర్ ఆఫర్లు ప్రకటించి ఓట్లను రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏపీలో టీడీపీ, వైసీపీ, జనసేన పార్టీలు పోటాపోటీగా హామీల జల్లు కురిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మహిళలకు మరో బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఇప్పటికే పసుపు కుంకుమ పథకాన్ని తీసుకొచ్చిన ఆయన.. ఇప్పడు ఉచిత స్టార్ట్‌ఫోన్లను తెరపైకి తెచ్చారు. టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తే కోటి మంది ఆడపడచులకు ఫోన్లు, పండగలకు రెండు సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చారు.

పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలందరికీ స్మార్ట్‌ఫోన్లు ఇస్తాం. దాదాపు కోటి మంది ఫోన్లతో పాటు పండగల సమయంలో రెండు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మీ సమస్యపై ఫోన్ ద్వారానే తెలియజేయవచ్చు. ఒక్క బటన్ నొక్కితే చాలు మేమే నేరుగా వచ్చి పరిశీలిస్తాం. ప్రజల అండదండలు నాకున్నాయ. ఎవ్వరికీ భయపడే ప్రసక్తే లేదు.
చంద్రబాబునాయుడు, ఏపీ సీఎం
ప్రకాశం జిల్లా గిద్దలూరులో ప్రచారం సందర్భంగా చంద్రబాబునాయుడు ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఐటీ దాడులకు భయపడి వైసీపీలోకి వెళ్లిపోయారని విమర్శించారు. ఒంగోలు పార్లమెంట్ స్థానంలో టీడీపీ శిద్దారాఘవరావును భారీ మెజార్టీతో గెలింపించాలని ప్రజలకు విజ్ఞప్తిచేశారు చంద్రబాబు.

ఇవి కూడా చదవండి:

భద్రాచలంను మేమే తీసుకుంటాం... చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

ఏపీ ఎన్నికలపై కొత్త సర్వే... నిజమైతే టీడీపీకి కష్టమే

చంద్రబాబు ఇలాఖాపై కన్నేసిన వైసీపీ... గెలుపు కోసం కొత్త వ్యూహం
Published by: Shiva Kumar Addula
First published: April 4, 2019, 5:24 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading