Home /News /politics /

AP ASSEMBLY ELECTIONS 2019 WHO WILL GET THE MAJOR SHARE IN SEA SHORE NORTH ANDHRA GROUND REPORT BA

Ground Report: ఉత్తరాంధ్ర ఓటరు ఎటువైపు? పవన్ పరిస్థితి ఏంటి? బాలయ్య అల్లుడు గెలుస్తారా?

శ్రీ భరత్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, రామ్మోహన్ నాయుడు

శ్రీ భరత్, పవన్ కళ్యాణ్, పురందేశ్వరి, రామ్మోహన్ నాయుడు

విశాఖ, విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం జిల్లాలో 10, విజయనగరం జిల్లాలో 9, విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్ధానాలు ఉన్నాయి.

    ఈసారి ఏపీ ఎన్నికల్లో ఉత్తరాంధ్ర ఓటరు నాడి ఎటు ఉండబోతోందన్నది సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. సాధారణంగా కుల సమీకరణాలతో పాటు అభివృద్ధి అజెండాగా ఉత్తరాంధ్ర ఓటర్లు తమ ఓటు వేస్తుంటారు. ఎవరికి ఓటు వేస్తే వెనుకబడిన తమ ప్రాంత అభివృద్ధి సాధ్యమవుతుందనే అంశం మీద ఓటర్ల అభిప్రాయం ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.  ఏపీలో ఏ రాజకీయ పార్టీ అధికారం చేపడుతుందనేది నిర్ణయించడంలో ఉత్తరాంధ్ర జిల్లాల తీర్పు కీలకమవుతుంటుంది. ఉత్తరాంధ్ర పరిధిలోకి వచ్చే విశాఖ, విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాల్లో మొత్తం 34 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో శ్రీకాకుళం జిల్లాలో 10, విజయనగరం జిల్లాలో 9, విశాఖ జిల్లాలో 15 అసెంబ్లీ స్ధానాలు ఉన్నాయి. సహజంగా విశాఖ నగరంతో పాటు విజయనగరం, శ్రీకాకుళం జిల్లా కేంద్రాల్లో అర్బన్ ఓటర్లు ఎక్కువ. మిగతా ప్రాంతాల్లో రూరల్ స్ధానాలు ఎక్కువగా ఉన్నాయి. గత ఎన్నికల్లో రుణమాఫీతో పాటు వెనుకబడిన ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ అంశం ప్రధానంగా ఇక్కడ ఓటర్లు తీర్పు ఇచ్చారు. అప్పట్లో కేంద్రంలో మోదీ సర్కారు, ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని ఓటర్లు ఆశించారు. కానీ వెనుకబడిన ప్రాంతాలకు ఇచ్చే ప్యాకేజీతో పాటు ఇతర హామీలను కేంద్రం విస్మరించింది.

    Andhra Pradesh news, Andhra Pradesh politics, Nandamuri Balakrisha, Nandamuri Balakrishna son in laws, Nara lokesh, Sribharat, bharat, TDP, chandrababu naidu, mangalagiri, vishakapatnam mp seat, ఆంధ్రప్రదేశ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, నందమూరి బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ అల్లుళ్లు, నారా లోకేశ్, శ్రీభరత్, టీడీపీ, చంద్రబాబునాయుడు, మంగళగిరి, విశాఖపట్నం ఎంపీ సీటు
    బాలకృష్ణ, నారా లోకేశ్, శ్రీభరత్


    కేంద్రం విభజన హామీలు నిలబెట్టుకోకపోవడంతో పాటు టీడీపీ సర్కారు కూడా ఆశించిన స్ధాయిలో అభివృద్ధి చేయలేదని ఉత్తరాంధ్ర ఓటర్లు భావిస్తున్నారు. విశాఖ నగరంపై పెట్టిన దృష్టి మిగతా ప్రాంతాలపై లేదనే విమర్శలూ ఉన్నాయి. భోగాపురం ఎయిర్ పోర్టు కోసం భూసేకరణలో ఆరోపణలు, నిర్వాసితులకు పరిహారం అందకపోవడంపైనా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. శ్రీకాకుళం జిల్లాలో కాకరాపల్లి ధర్మల్ విద్యుత్ ప్లాంట్ సహా అణువిద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. హుదుద్, పైలిన్ తో పాటు తుపానుల సమయంలో ప్రభుత్వ సాయంపైనా విమర్శలున్నాయి. ఇవన్నీ తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటాయన్న ఆందోళన టీడీపీలో కనిపిస్తోంది. ప్రభుత్వంపై వ్యతిరేకతను సొమ్ము చేసుకోవడంలో వైసీపీ విఫలమవుతోందనే వాదన ఉంది.

    ap assembly elections 2019,ap elections 2019,ap assembly elections,ap assembly elections updates,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly election schedule 2019,assembly elections,mla candidates list for ap assembly elections,tdp mla candidates list for ap assembly elections,first list for assembly election,ap news,jd lakshmi narayana,janasena party,janasena,cbi jd lakshmi narayana,lakshmi narayana,cbi ex jd lakshmi narayana,jd lakshmi narayana speech,jd lakshmi narayana to join janasena,jd lakshmi narayana janasena,ex jd lakshmi narayana,jd lakshmi narayana party,jd lakshmi narayana latest,jd lakshmi narayana interview,jd lakshmi narayana latest news,jd lakshmi narayana pawan kalyan,పవన్ కల్యాణ్,జనసేన,పవన్ కళ్యాణ్,జేడీ లక్ష్మీనారాయణ,
    లక్ష్మీనారాయణ, పవన్ కళ్యాణ్


    విశాఖ నగరంలో మాత్రం పరిస్ధితి కాస్త భిన్నంగా కనిపిస్తోంది. విద్యావంతులైన ఓటర్లుండటం, నగరంలో ఐటీతో పాటు ఇతర రంగాలకు ప్రభుత్వం కల్పించిన ప్రాధాన్యం టీడీపీకి సానుకూలాంశాలు కానున్నాయి. ఈసారి విశాఖ ఎంపీ స్థానం పరిధిలో జనసేన తరఫున సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, బాలకృష్ణ చిన్న అల్లుడు శ్రీభరత్, వైసీపీ అభ్యర్ధి ఎంవీపీ సత్యనారాయణ, బీజేపీ తరఫున పురందేశ్వరి రంగంలో ఉన్నారు. అర్బన్ ఓటర్లలో లక్ష్మీనారాయణతో పాటు టీడీపీ అభ్యర్ధి భరత్ పైనా సానుకూలత కనిపిస్తోంది. కానీ నాలుగు పార్టీల మధ్య భారీగా ఓట్ల చీలిక తప్పని పరిస్ధితి నెలకొంది.

    విశాఖలో వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎంవీవీ సత్యనారాయణ


    విశాఖ నగరం పరిధిలోకి వచ్చే గాజువాక నియోజకవర్గంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండటం ఇక్కడ ప్రత్యేకంగా మారింది. గాజువాకలో పవన్ విజయావకాశాలు మెరుగ్గా ఉన్నాయి. దీంతో జనసేన ఎంపీ అభ్యర్ధిగా ఉన్న లక్ష్మీనారాయణ అవకాశాలు కూడా మెరుగుపడ్డాయి. అయితే నగరంలో టీడీపీకి ఉన్న పట్టు భరత్ కు కలిసి రానుంది. చతుర్ముఖ పోటీలో వైసీపీ అభ్యర్ధి సత్యనారాయణకు కూడా అవకాశం ఉండొచ్చని చెప్తున్నారు.

    నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తున్న పురందేశ్వరి


    విశాఖ రైల్వేజోన్ ప్రకటన కూడా ఈసారి ఎన్నికల్లో కీలకం కానుంది. కేంద్రం విభజన హామీల్లో భాగంగా రైల్వేజోన్ ప్రకటించినా... వాల్తేరు డివిజన్ ను అందులో కలపకపోవడంపై విశాఖ ఓటర్లు ఆగ్రహంగా ఉన్నారు. దీన్ని టీడీపీ, జనసేనతో పాటు వైసీపీ కూడా సొమ్ముచేసుకునే అవకాశముంది. ఆ మేరకు బీజేపీ అభ్యర్ధి దగ్గుబాటి పురందేశ్వరికి నష్టం జరగనుంది. గత ఎన్నికల్లో టీడీపీ మద్దతుతో పోటీ చేసి గెలిచిన బీజేపీ అభ్యర్ధి కంభంపాటి హరిబాబు ఈసారి ఎన్నికలకు దూరంగా ఉన్నారు. దీంతో రంగంలోకి దిగిన పురందేశ్వరి... రైల్వేజోన్ ప్రకటనను కూడా గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేని పరిస్ధితి నెలకొనడం విశేషమే.

    vizag,visakhapatnam,kambampati haribabu,ys jagan,rahul gandhi,congress,lok sabha elections 2019,lok sabha election,lok sabha election 2019,2019 lok sabha elections,lok sabha elections,2019 elections,lok sabha polls,lok sabha elections 2019 telangana,india lok sabha election date,andhra pradesh lok sabha election 2019,india lok sabha election 2019,bjp leader before lok sabha elections,telangana 2019 lok sabha,election,lok sabha alliance,ap assembly elections 2019,ap assembly elections,ap elections 2019,assembly elections,ap elections,ap assembly elections 2019 date,ap assembly election 2019,ap assembly elections 2019 survey,ap assembly elections 2019 schedule,ap assembly elections 2019 predictions,ap assembly election schedule 2019,ap assembly elections 2019 candidates list,opinion poll survey on ap assembly elections 2019,ap politics,లోక్ సభ ఎన్నికలు,తెలంగాణ ఎన్నికలు,ఏపీ అసెంబ్లీ ఎన్నికలు,వైసీపీ,వైఎస్సార్సీపీ,జగన్,విశాఖపట్నం,విశాఖ నియోజకవర్గం,విశాఖ లోక్ సభ స్థానం,కంబంపాటి హరిబాబు,
    విశాఖ బీచ్


    మొత్తం మీద ఉత్తరాంధ్రలో ఈసారి ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తున్నా... విశాఖ నగరంలో మాత్రం టీడీపీకి కాస్త సానుకూలత ఉన్నట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో సమీకరణాలు ఎటువైపు మొగ్గుచూపినా ఆశ్చర్యం లేదు.

    (సయ్యద్ అహ్మద్, కరస్పాండెంట్, న్యూస్‌18)
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Janasena party, Lok Sabha Election 2019, Pawan kalyan, Purandeswari, Srikakulam S01p02, Tdp, Visakha Railway Zone, Visakhapatnam S01p04, Vizianagaram S01p03, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు