• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP ASSEMBLY ELECTIONS 2019 TRIANGLE WAR AT TENALI ASSEMBLY WILL NADENDLA MANOHAR HOIST THE JANASENA FLAG BA

Ground Report: తెనాలిలో మళ్లీ ఆ ముగ్గురే పోటీ.. ఈ సారి ఎగిరే జెండా ఏది?

Ground Report: తెనాలిలో మళ్లీ ఆ ముగ్గురే పోటీ.. ఈ సారి ఎగిరే జెండా ఏది?

ఆలపాటి రాజా, అన్నాబత్తుని శివకుమార్, నాదెండ్ల మనోహర్

2014లో తెనాలి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆ ముగ్గురే మరోసారి బరిలో దిగారు. ముగ్గురూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడం ఇక్కడ విశేషం.

  • Share this:
    స్వాతంత్రోద్యమంలో జాతీయ కాంక్షను రగిల్చిన సమరయోధులు, రాజకీయంగా ఉన్నత పదవులు అలంకరించిన ఉద్ధండులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం తెనాలి. మూడుకాల్వలతో ఆంధ్ర ప్యారిస్ గా గుర్తింపు తెచ్చుకున్న తెనాలి కళలకు నిలయం. పట్టణ, గ్రామీణ ప్రాంతాలతో కూడిన సంపన్నమైన ప్రాంతం. 110 సంవత్సరాల క్రితం పురపాలక సంఘంగా ఏర్పడిన ఘన చరిత్ర తెనాలికి ఉంది. తెనాలి, కొల్లిపర మండలాలతో 1952వ సంవత్సరంలో తెనాలి నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటివరకు తెనాలిలో 14 సార్లు ఎన్నికలు జరగగా 7 సార్లు కాంగ్రెస్, 5 సార్లు తెలుగుదేశం విజయం సాధించాయి. స్వతంత్రులు, జనతా పార్టీ అభ్యర్థులు ఒక్కోమారు గెలుపొందారు. 1982లో తెలుగుదేశం ఆవిర్భవించిన తరువాత 8 సార్లు ఎన్నికలు జరిగాయి. 5సార్లు టీడీపీ, మూడుసార్లు కాంగ్రెస్ విజయం సాధించాయి. ఇంతటి ఘన చరిత్ర కలిగిన తెనాలి నియోజకవర్గంలో ఇప్పుడు త్రిముఖ పోరు రసవత్తరంగా సాగుతుంది. గెలుపుపై ప్రధాన పార్టీల అభ్యర్థులు ముగ్గురు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

    2014 జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం తరఫున ఆలపాటి రాజా, వైసీపీ నుంచి అన్నాబత్తుని శివ కుమార్, కాంగ్రెస్ పార్టీ నుంచి నాదెండ్ల మనోహర్ పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా 19,065 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ ముగ్గురే పోటీ చేస్తున్నారు. కాకపోతే నాదెండ్ల మనోహర్ జనసేన నుండిపోటీ చేస్తున్నారు ముగ్గురు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం తో పోటీ ఆసక్తికరంగా మారింది.

    Ap Assembly elections 2019, Tenali Assembly, Tenali MLA Candidates, Alapati Raja TDP, Nadendla Manohar Janasena, Annabattuni Siva Kumar YSRCP, Lok Sabha Elections 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019, లోక్‌సభ ఎన్నికలు 2019, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం, టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా, జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్
    తెనాలి టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా


    నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అందర్నీ కలుపుకొని పోవడం, బీసీ, ఎస్సీ, మైనారిటీలకు వెన్నుదన్నుగా నిలవడం ఆలపాటి రాజా కలిసొచ్చే అంశాలు. క్షేత్రస్థాయిలోనూ టీడీపీకి బలమైన నాయకులు, అనుచరగణం, ఎన్నికల ప్రచారంలో ముందు ఉండటం కలిసొచ్చే అంశాలు. ద్వితీయ శ్రేణి నాయకులు కొందరు పార్టీ నుంచి వలస వెళ్లటం, పట్టణంలో ఒక వర్గానికి చేరువ కాలేకపోవటం, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులు బలమైనవారు కావటం ప్రతికూలాంశాలు.

    Ap Assembly elections 2019, Tenali Assembly, Tenali MLA Candidates, Alapati Raja TDP, Nadendla Manohar Janasena, Annabattuni Siva Kumar YSRCP, Lok Sabha Elections 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019, లోక్‌సభ ఎన్నికలు 2019, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం, టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా, జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్
    పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్


    జనసేన నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి, మాజీ ముఖ్యమంత్రి నాదెళ్ల భాస్కర్రావు తనయుడు నాదెళ్ల మనోహర్ పోటీ చేస్తున్నారు. గతంలో చేసిన అభివృద్ధి, ప్రజలకు నేరుగా పనులు చేయటం, అన్ని వర్గాల వారితో సత్సంబంధాలు కలిగి ఉండటం మనోహర్ బలం. ముఖ్యంగా జనసేనను బలపరుస్తున్న సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం కలిసొచ్చే అంశాలు. ప్రచారం సందర్భంగా క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసే నాయకులు లేకపోవటం, ఎన్నికలకు ఆలస్యంగా సన్నద్ధమవటం ప్రతికూలాంశాలు.

    Ap Assembly elections 2019, Tenali Assembly, Tenali MLA Candidates, Alapati Raja TDP, Nadendla Manohar Janasena, Annabattuni Siva Kumar YSRCP, Lok Sabha Elections 2019, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019, లోక్‌సభ ఎన్నికలు 2019, తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం, టీడీపీ అభ్యర్థి ఆలపాటి రాజా, జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్
    తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్


    ఇక వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అన్నాబత్తుని శివ కుమార్‌కు గతంలో ఓడినా కార్యకర్తలకు అందుబాటులో ఉండటం, 2014లో ఓడిపోయారనే సానుభూతి, స్థానిక సమస్యలపై పోరాటాలు, ప్రభుత్వ వ్యతిరేకత కలిసొచ్చే అంశాలు. బలమైన ద్వితీయ శ్రేణి నాయకులు లేకపోవటం, క్షేత్ర స్థాయిలో ఎన్నికల నిర్వహణ తెలిసిన కేడర్ లేకపోవడం ప్రతికూల అంశాలు.

    (రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)
    Published by:Ashok Kumar Bonepalli
    First published: