చంద్రబాబుపై తిరుగుబాటు ఖాయం...వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

దళితులు ఈసారైనా సత్తాచూపి టీడీపీకి బుద్ధిచెప్పాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.

news18-telugu
Updated: May 17, 2019, 3:32 PM IST
చంద్రబాబుపై తిరుగుబాటు ఖాయం...వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
విజయసాయిరెడ్డి, చంద్రబాబు
news18-telugu
Updated: May 17, 2019, 3:32 PM IST
ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడే కొద్దీ వైసీపీ, టీడీపీ మధ్య మాటల యుద్ధం పెరుగుతోంది. ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటూ ఏపీ రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. మే 23న ఫలితాలు వెలువడ్డ తర్వాత టీడీపీ ముక్కలు చెక్కలవుతుందని స్పష్టంచేశారు. టీడీపీని భ్రష్టుపట్టించిన చంద్రబాబుపై తిరుగుబాటు మొదలవుతుందని చెప్పారు విజయసాయిరెడ్డి. పరువు కాపాడుకునేందుకే మహానాడును రద్దుచేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

23 తర్వాత తెలుగుదేశం పార్టీ ముక్క చెక్కలవుతుంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీని తన స్వార్థ ప్రయోజనాల కోసం భ్రష్టు పట్టించినందుకు చంద్రబాబుపై తిరుగుబాటు జరుగుతుంది. ఇది గమనించే పరువు కాపాడుకునేందుకు మహానాడును రద్దు చేశాడు. ఇంకా చాలా వింతలు, విడ్డూరాలు చూడబోతున్నాం.
విజయసాయిరెడ్డి, వైసీపీ ఎంపీ


చంద్రగిరి రీపోలింగ్‌ విషయంలోనూ చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు విజయసాయిరెడ్డి. దళితులను బెదిరించి రిగ్గింగ్‌కు పాల్పడడం వల్లే రీపోలింగ్‌కు ఈసీ ఆదేశించిందని ఆయన వెల్లడించారు. అక్రమాలకు పాల్పడకపోతే భయమెందుకని ప్రశ్నించారు. రిపోలింగ్ అన్యాయమంటూ ఎందుకు ఆందోళనలు చేస్తున్నారని విమర్శించారు. దళితులు ఈసారైనా సత్తాచూపి టీడీపీకి బుద్ధిచెప్పాలని విజయసాయిరెడ్డి పిలుపునిచ్చారు.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...