పవన్‌కు డబ్బు, డైలాగులు ఇచ్చేది చంద్రబాబే: పులివెందులలో జగన్

రాబోయే రోజుల్లో కోట్లు కుమ్మరించి ఓట్లను కొనేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తారని జగన్ విమర్శించారు. టీడీపీ డబ్బులకు వైసీపీ నవరత్నాలే పోటీకావాలన్నారు.

news18-telugu
Updated: March 22, 2019, 2:18 PM IST
పవన్‌కు డబ్బు, డైలాగులు ఇచ్చేది చంద్రబాబే: పులివెందులలో జగన్
పులివెందులో వైఎస్ జగన్
news18-telugu
Updated: March 22, 2019, 2:18 PM IST
వైఎస్ వివేకానందరెడ్డిని టీడీపీ వాళ్లే హత్యచేశారని వైఎస్ జగన్ ఆరోపించారు. పులివెందుల, జమ్మలమడుగులో వైసీపీ ఓటర్లను భయపెట్టేందుకే బాబాయ్‌ని దారుణంగా చంపారని విమర్శించారు. వైసీపీ ఓట్లను చీల్చేందుకే జనసేన పార్టీని చంద్రబాబు రంగంలోకి దించారని ధ్వజమెత్తారు జగన్. పవన్ కళ్యాణ్‌కు చంద్రబాబే డబ్బును సమకూర్చుతున్నారని...డైలాగులు కూడా రాసిస్తున్నారని విరుచుకుపడ్డారు. పులివెందులలో నామినేషన్ వేసేముందు బహిరంగ సభలో పాల్గొన్నారు జగన్. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు.

రాష్ట్రంలో విపరీతమైన కుట్రలు జరుగుతున్నాయి. బాబాయ్ లాంటి సౌమ్యుడు ఎవరు ఉండరేమో. టీడీపీ వాళ్లే ఆయన్ను అతి దారుణంగా చంపించారు. వీళ్లే హత్యచేసి వీళ్లే పోలీసులతో విచారణ చేయిస్తున్నారు. కడప జిల్లాలో గెలవలేమమని తెలిసి చంద్రబాబు హత్యా రాజకీయాలు చేస్తున్నారు. చిన్నాన్నను హత్యచేసే జమ్మలమడుగులో తిరిగేవారుండరు. ఆ హత్యానేరాన్ని వైఎస్ కుటుంబంపై వేస్తే పులివెందులలో కూడా తిరిగేవారు ఉండరని కుట్రచేశారు. మన నాయకులను అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయి. కార్యకర్తలు సంయమనంగా ఉండాలి.
వైఎస్ జగన్, వైసీపీ అధినేత


చంద్రబాబు తన భాగస్వామి పవన్ కల్యాణ్‌తో స్క్రిప్ట్‌ చదివిస్తారు. డబ్బులు, డైలాగులు, అభ్యర్థులన్నీ చంద్రబాబువే. కేవలం బీఫారంలు మాత్రమే ఆ యాక్టర్‌ ఇస్తాడు. చంద్రబాబు కాంగ్రెస్‌తో కుమ్మకై జగన్‌ను ఇబ్బందిపెట్టడానికి లక్ష్మీనారాయణను ఉపయోగించారు. ఇప్పుడు అదే సీబీఐ మాజీ జేడీ టీడీపీ తరపున భీమిలీలో పోటీచేయించాలనుకున్నారు. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో జనసేన నుంచి బరిలో దింపుతున్నారు. ప్రతిపక్షాల ఓట్లు చీల్చేందుకు చంద్రబాబు డ్రామాలు ఆడుతున్నారు. ఎన్ని కుట్రలు చేసినా రాబోయేది వైసీపీ ప్రభుత్వమే.
వైఎస్ జగన్, వైసీపీ అధినేత
రాబోయే రోజుల్లో కోట్లు కుమ్మరించి ఓట్లను కొనేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తారని జగన్ విమర్శించారు. టీడీపీ డబ్బులకు వైసీపీ నవరత్నాలే పోటీకావాలన్నారు. నవరత్న పథకాలతో ఎలాంటి మేలు జరుగుతుందో ప్రతి ఇంటికీ తిరిగి చెప్పాలని కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. రావణుడి పాలన వానరులతోనే అంతమైందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
First published: March 22, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...