ఆ 19 చోట్ల రీపోలింగ్ జరపాల్సిందే...టీడీపీ డిమాండ్

వైసీపీ ఫిర్యాదులపై ఆగమేఘాలపై ఈసీ స్పందిస్తోందని..కానీ టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. ఈ 19 బూత్‌ల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని.. రీపోలింగ్ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు.

news18-telugu
Updated: May 17, 2019, 4:17 PM IST
ఆ 19 చోట్ల రీపోలింగ్ జరపాల్సిందే...టీడీపీ డిమాండ్
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ఏపీలో రీపోలింగ్ రచ్చ జరుగుతోంది. మరో 2 రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో రాష్ట్రంలో రీపోలింగ్ రాజకీయాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే వైసీపీ డిమాండ్‌తో చంద్రగిరిలోని 5 బూత్‌లలో రీపోలింగ్‌ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేసిన టీడీపీ..వైసీపీ నేతలు చెప్పినట్లుగానే ఈసీ నడుచుకుంటోందని ఆరోపిస్తున్నారు. తాము చెప్పిన ప్రాంతాల్లో మాత్రం రీపోలింగ్ జరపలేదని మండిపడుతున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యాన్ని కలిసిన టీడీపీ నేతలు 7 నియోజకవర్గాల్లోని 19 చోట్ల రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు.

సచివాలయంలో సీఈసీని కలిసిన వారిలో దేవినేని, కొల్లు రవీంద్ర, జవహర్, నక్కా ఆనంద్ బాబుతో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. తమ వినతి పత్రాన్ని సీఈసీకి పంపుతూ రీపోలింగ్‌కు సిఫార్సు చేయాలని ఎల్వీ సుబ్రమణ్యాన్ని డిమాండ్ చేశారు. వైసీపీ ఫిర్యాదులపై ఆగమేఘాలపై ఈసీ స్పందిస్తోందని..కానీ టీడీపీ ఫిర్యాదులను పట్టించుకోవడం లేదని మంత్రి నక్కా ఆనంద్ బాబు మండిపడ్డారు. వైసీపీ నేతలు ముందుగానే ఈసీతో మాట్లాడుకుని ఆ తర్వాతే సీఎస్‌కు ఫిర్యాదుచేసినట్లు కనిపిస్తోందని అనుమానం వ్యక్తంచేశారు. ఈ 19 బూత్‌ల్లో వైసీపీ అక్రమాలకు పాల్పడిందని.. రీపోలింగ్ జరపాల్సిందేనని డిమాండ్ చేశారు.

టీడీపీ రీపోలింగ్‌కు డిమాండ్ చేసిన బూత్‌లు

రాజంపేట: 78, 130, 131, 132


చంద్రగిరి: 310, 311, 323
ఉప్పలపాడు: 214, 215
జమ్మలమడుగు: 287, 288సత్తెనపల్లి: 160, 161, 162
కోడూరు: 21, 244
సత్యవేడు: 80,81
First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>