Home /News /politics /

AP ASSEMBLY ELECTIONS 2019 PROHIBITION ON EXIT POLLS SAYS TELANGANA CEO RAJATH KUMAR SK

ఎగ్జిట్ పోల్స్‌పై ఎన్నికల సంఘం నిషేధం..అప్పటి వరకు అంతే...

ప్రతీకాత్మక  చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఏప్రిల్ 11 ఉదయం 7 గంటల నుంచి మే 19 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని రజత్ కుమార్ చెప్పారు.

    మరికొద్ది గంటల్లో ఏపీ, తెలంగాణలో పోలింగ్ జరగబోతోంది. తెలంగాణలో 17 లోక్‌స్థానాలకు ఎన్నికలు జరుతున్నాయి. సాధారణంగా పోలింగ్ తర్వాత అందరి కళ్లు ఎగ్జిట్ పోల్స్‌పైనే ఉంటాయి. దాని ఆధారంగా ప్రజలు ఎవరి వైపు ఉన్నారని ఓ అంచనా వస్తుంది. కానీ ఈ సారి ఆ పరిస్థితి లేదు. ఏడు విడతల్లో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో చివరి దశ ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎగ్జిట్‌పోల్స్‌పై నిషేధం ఉంది. పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ తోపాటూ, ఫలితాలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచురించడంపై, వ్యాప్తిచేయడంపై చట్టం ప్రకారం ఆంక్షలున్నాయని గుర్తుచేస్తూ, వాటిని నిక్కచ్చిగా పాటించాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్ పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు.

    ఏప్రిల్ 11 ఉదయం 7 గంటల నుంచి మే 19 సాయంత్రం 6.30 గంటల వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుందని రజత్ కుమార్ చెప్పారు. అప్పటి వరకుప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ఎటువంటి ఎగ్జిట్ పోల్స్ నిర్వహణ, ప్రచురణ, సమాచారం వ్యాప్తి చేయకూడదని, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూడా ప్రకటించకూడదని ఆయన స్పష్టం చేసారు. ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951కు సంబంధించిన సెక్షన్ 126 ఎ లోని సబ్ సెక్షన్(1), (2)ల కింద సంక్రమించిన అధికారాల ప్రకారం ఈ ఆంక్షలు విధించినట్లు వెల్లడించారు. పోలింగ్ ముగింపునకు ముందున్న 48 గంటల వ్యవధిలో ఎటువంటి ఒపీనియన్ పోల్స్ ఫలితాలు, సర్వేలు, ఎన్నికల సమాచారం ప్రకటన వంటివి చేయకూడదని స్పష్టంచేశారు.

    మే 19న ఏడో విడత ఎన్నికలు పూర్తవుతాయి. దేశంలోని అన్ని చోట్లా ఎన్నిక పోలింగ్ ముగుస్తుంది. దాంతో ఆ రోజు సాయంత్రం 7 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్, సర్వే వివరాలను వెల్లడించవచ్చు. కాగా, మే 23న తుది ఫలితాలు వెలువడనున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Election Commission of India, Lok Sabha Election 2019, Telangana, Telangana Lok Sabha Elections 2019, Telangana News, Telangana Politics

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు