• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • AP ASSEMBLY ELECTIONS 2019 JANASENA WILL GET 120 140 SEATS IN AP SAYS JABARDASTH DHANRAJ SK

ఏపీలో జనసేన తుఫాన్...పవన్ పార్టీకి 120 సీట్లు ఖాయమట..

ఏపీలో జనసేన తుఫాన్...పవన్ పార్టీకి 120 సీట్లు ఖాయమట..

జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో అడుగుపెడతారని మాజీ ఎంపీ, ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరుపొందిన లగడపాటి రాజగోపాల్ ఇప్పటికే స్పష్టం చేశారు.

మే 23న ఏపీలో జనసేన శతఘ్ని తుఫాన్ రాబోతోందని..గంటలకు 120-145 కి.మీ. వేగంతో గాలులు వస్తాయని ఫేస్‌బుక్‌ పోస్ట్ పెట్టారు.

  • Share this:
    మరో వారం రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కింగ్ ఎవరో? కింగ్ మేకర్ ఎవరో? మే 23న తేలనుంది. ఈ లోపు ఎవరికి వారు గెలుపుపై ధీమావ్యక్తం చేస్తున్నారు. కాబోయే సీఎం జగన్ అంటూ వైసీపీ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. చంద్రబాబు మళ్లీ గెలుస్తారని టీడీపీ నేతలు నమ్ముతున్నారు. ఏపీలో నిశ్శబ్ద విప్లవం ఉందని..జనసేనకు ఎవరూ ఊహించి ఫలితాలు వస్తాయని ఆ పార్టీ నేతలు స్పష్టంచేస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ ఎన్నికలపై కమెడియన్, జబర్దస్త్ ఫేమ్ ధన్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

    మే 23న ఏపీలో జనసేన శతఘ్ని తుఫాన్ రాబోతోందని..గంటలకు 120-145 కి.మీ. వేగంతో గాలులు వస్తాయని ఫేస్‌బుక్‌ పోస్ట్ పెట్టారు. ఆ ఈదురుగాలుల ధాటికి ఎవరైనా కొట్టుకుపోతే తమకు సంబంధం లేదని టీడీపీ, వైసీపీలపై పరోక్షంగా వ్యంగ్యాస్త్రాలు సంధించాడు. జనసేనకు 120 నుంచి 145 స్థానాలు రాబోతున్నాయన్నది ఆ పోస్టు సారాంశం. శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేస్తుందని జనసేన అభిప్రాయపడ్డాడు.
    ధన్‌రాజ్ చేసిన ఈ ఫేస్‌బుక్ పోస్టుపై సోషల్ మీడియాలో జోకులు పేలుతున్నాయి. అసలు ఏపీలో ఎన్ని అసెంబ్లీ సీట్లు ఉన్నాయి? జనసేన ఎన్ని సీట్లలో పోటీచేసిందో తెలుసా? అంటూ నెటిజన్లు ఏకి పారేస్తున్నారు. ఇన్నాళ్లు ఎక్కడికి పోయావంటూ సెటైర్లు వేస్తున్నారు. తనపై విపరీతంగా ట్రోలింగ్ జరగడంతో ధన్‌రాజ్ ఆ పోస్టును డిలీట్ చేశాడు. కానీ అప్పటికే చాలామంది స్క్రీన్ షాట్స్ తీసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
    First published: