తాను కింగ్ మేకర్ కాదని..కింగ్‌నని స్పష్టంచేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. ఏపీలో బీఎస్పీ-జనసేన కూటమే ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తుందని ధీమావ్యక్తం చేశారు. ఎవరికో మద్దతివ్వాల్సిన అవసరం తనకు లేదని చెప్పుకొచ్చారు. రాష్ట్రంలో హంగ్ ఏర్పడే ప్రసక్తే లేదని..ఖచ్చితంగా తామే గెలుస్తామని స్పష్టంచేశారు. అవినీతిని రూపుమాపడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు జనసేనాని. న్యూస్18తో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడిన పవన్ కల్యాణ్... గెలుపుపై ధీమా వ్యక్తంచేశారు.
ప్రజలు ప్రాంతాలుగా విడిపోవడం దేశ సమగ్రతకు మంచిది కాదన్నారు. ఐతే తెలంగాణ, ఏపీ నేతల మధ్య గొడవలు తప్ప ప్రజల మధ్య అలాంటివి లేవని చెప్పారు పవన్. తెలంగాణ సీఎం కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకం కాదని... ఆయన కమలం పార్టీకే మద్దతిస్తున్నారని స్పష్టంచేశారు.
న్యూస్ 18తో పవన్ టిక్‌టాక్:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Ap, AP News, AP Politics, Bsp, Janasena, Janasena party, Pawan kalyan, Visakhapatnam, Visakhapatnam S01p04