Home /News /politics /

AP ASSEMBLY ELECTIONS 2019 JANASENA CHIEF PAWAN SENSATIONAL COMMENTS ON ALI SK

అలీ మోసం చేసాడు...పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు

అలీ, పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటోలు)

అలీ, పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటోలు)

స్నేహం వేరు..రాజకీయం వేరు అని గతంలో అన్న పవన్ కల్యాణ్..ఇప్పుడు అలీపై విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది.

    తన స్నేహితుడు అలీపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అలీని ప్రాణస్నేహితుడిగా భావించి నమ్మితే..మోసం చేసి వెళ్లిపోయాడని విమర్శించారు. అలీ సూచించిన వ్యక్తికే నరసారావుపేట ఎంపీ టికెట్ ఇచ్చానని..కానీ ఆయన మాత్రం వైసీపీకి ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. అందుకే తాను ఎవరినీ నమ్మడం లేదని.. ప్రజలను మాత్రమే నమ్ముకున్నానని స్పష్టంచేశారు జనసేనాని. రాజమండ్రిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడిన పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

    అలీ పరిచయం చేసిన వ్యక్తిని నమ్మి నేను ఎంపీ టిక్కెట్ ఇచ్చాను. కానీ నా స్నేహితుడు మాత్రం వైసీపీలోకి వెళ్ళాడు. అలీకి ఏదైనా అవసరం వస్తే అండగా ఉన్నా. అలాంటి వాళ్లే వదిలేస్తే..ఏం చేయాలి? ఇదేనా స్నేహం? అందుకే నేను స్నేహితులను, బంధువులను నమ్మడం మానేసాను. అలీ లాంటి వ్యక్తికి ఎప్పుడు ప్రేమగా ఉంటే అటువంటి వారు కూడా నన్ను నమ్మలేదు, నా గెలుపును నమ్మలేదు. ఈరోజు వైసీపీ వాడుకొని వదిలేసింది. అటువంటి వారు నాకు అవసరం లేదు, నేను మిమ్మల్ని మాత్రమే నమ్మాను.
    పవన్ కల్యాణ్, జనసేన చీఫ్


    అలీ, పవన్ కల్యాణ్ బెస్ట్ ఫ్రెండ్స్..! ఒకటి రెండు తప్పా పవన్ నటించిన అన్ని సినామాల్లోనూ అలీ ఉన్నారు. సినిమాల్లోనే కాదు బయట కూడా చాలా క్లోజ్‌గా ఉంటారు. ఐతే ఎన్నికల వేళ ఇద్దరు రెండు వేర్వేరు దారులు ఎంచుకున్నారు. అలీ మొదట జనసేనలో చేరుతారని ప్రచారం జరిగినా..చివరకు ఆయన వైసీపీ గూటికి చేరారు. వైసీపీకి మద్దతుగా పలు చోట్ల ప్రచారం కూడా నిర్వహించారు. ఐతే స్నేహం వేరు..రాజకీయం వేరు అని గతంలో అన్న పవన్ కల్యాణ్..ఇప్పుడు అలీపై విమర్శలు గుప్పించడం హాట్‌టాపిక్‌గా మారింది.

    ఇది కూడా చదవండి:

    వైసీపీలోకి వెళ్తే తప్పేంటి? మీరేమైనా ధనం ఇచ్చారా? పవన్‌కు అలీ ఘాటు కౌంటర్
    First published:

    Tags: Ali, Andhra Pradesh, Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Janasena, Janasena party, Pawan kalyan, Telugu Movie, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు