వైసీపీ ఎంపీ అభ్యర్థిపై ఐటీ దాడులు..ఇళ్లు,కార్యాలయాల్లో సోదాలు

ప్రతీకాత్మక చిత్రం

మంగళవారం రాత్రి గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. అదే గుంటూరులో ఇప్పుడు వైసీపీ అభ్యర్థిపైనా ఐటీ దాడులు జరగడం హాట్‌టాపిక్‌గా మారింది.

  • Share this:
    ఎన్నికల వేళ ఏపీలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. పోలింగ్‌కు కొన్ని గంటల ముందు మరోసారి ఐటీ సోదాలు తీవ్ర కలకలం రేపాయి. గుంటూరు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఆదాయపన్నుశాఖ అధికారులు సోదాలు చేశారు. గుంటూరు పట్టాభిపురంలోని నివాసంతో పాటు కార్యాలయాల్లోనూ తనిఖీలు చేపట్టారు. అటు మోదుగుల చీఫ్ ఏజెంట్ సుధాకర్ రెడ్డి ఇంట్లోనూ సోదాలు చేసినట్లు సమాచారం.

    మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ ఎంపీ అభ్యర్ధి


    మంగళవారం రాత్రి గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థి గల్లా జయదేవ్ కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. గల్లా జయదేవ్ కంపెనీ అకౌంటెంట్‌ను ప్రశ్నించారు. ఐతే ఐటీ సోదాలపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్నికల వేళ కేంద్రం కావాలనే ఐటీని ఉసిగొల్పుతోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో అదే గుంటూరులో వైసీపీ అభ్యర్థిపైనా ఐటీ దాడులు జరగడం హాట్‌టాపిక్‌గా మారింది.
    First published: