టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు...భారీగా నగదు స్వాధీనం..?

ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఐటీ, సీబీఐ సంస్థలను అడ్డంపెట్టుకొని టీడీపీ నేతలను మోదీ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలను ఐటీ శాఖ టార్గెట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది.

news18-telugu
Updated: April 3, 2019, 6:55 PM IST
టీడీపీ అభ్యర్థి ఇంటిపై ఐటీ దాడులు...భారీగా నగదు స్వాధీనం..?
తెలుగుదేశం పార్టీ లోగో
news18-telugu
Updated: April 3, 2019, 6:55 PM IST
ఎన్నికలవేళ ఏపీలో ఐటీ సోదాలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. మైదుకూరు టీడీపీ అభ్యర్ పుట్టా సుధాకర్ యాదవ్ ఇంటిపై బుధవారం ఐటీ దాడులు జరిగాయి. ప్రొద్దుటూరులోని పుట్టా సుధాకర్ నివాసంలో ఆదాయపన్ను శాఖ అధికారులు తనిఖీలు చేశారు. సోదాల అనంతరం భారీగా డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలింగ్‌కు ముందు ఈ దాడులు జరగడం ఏపీ రాజకీయాల్లో సంచలనగా మారింది. కొన్ని రోజుల క్రితం కనిగిరి అభ్యర్థి ఉగ్రనరసింహారెడ్డి, మంత్రి నారాయణకు చెందిన నివాసాల్లో ఐటీ సోదాలు జరిగాయి. మరికొందరు నేతలపైనా దాడులు జరిగే అవకాశముందని టీడీపీ భావిస్తోంది. ప్రకాశం, నెల్లూరు, కృష్ణా, గుంటూరు, విశాఖపట్టణం జిల్లాలకు చెందిన నేతలను టార్గెట్‌చేస్తారని భావిస్తోంది.

నాపై ఐటీ దాడులు ప్రత్యర్థుల కుట్రే. నాపై గెలవలేమన్న భయంతోనే ఐటీతో దాడులు చేయిస్తున్నారు. చట్టానికి లోబడే మా కంపెనీలు పనిచేస్తున్నాయి. మాది రూ.500 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీ. మేం రూపాయి కూడా అవకతవకలకు పాల్పడలేదు. ఎవ్వరికీ భయపడం.
పుట్టా సుధాకర్ యాదవ్


Income tax,IT raids, mydukur tdp, putta sudhakar yadav,proddatur,putta sudhakar yadav IT,ap assembly elections 2019, మైదుకూరు, పుట్టా సుధాకర్ యాదవ్, ఆదాయపన్నుశాఖ, ఐటీ సోదాలు
పుట్టా సుధాకర్ యాదవ్


ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కేంద్రంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఐటీ, సీబీఐ సంస్థలను అడ్డంపెట్టుకొని టీడీపీ నేతలను మోదీ బెదిరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలను ఐటీ శాఖ టార్గెట్ చేయడం హాట్‌టాపిక్‌గా మారింది. కర్నాటక, తమిళనాడు లోనూ ఇదే తరహాలోనే ఐటీ దాడులు జరిగాయి. ఐతే కర్నాటక సీఎం కుమారస్వామి ఆదాయపన్నుశాఖ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. ఎన్నికల వేళ కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని నిరసన వ్యక్తంచేశారు. ఇప్పుడు ఏపీలోనూ ఐటీ సోదాలు జరుగుతున్న నేపథ్యంలో ఎలా కౌంటర్ ఇవ్వాలన్న దానిపై టీడీపీ సమాలోచనలు చేస్తోంది.
First published: April 3, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...