రోజా గెలుపుపై జోరుగా బెట్టింగ్‌లు...నగరి ఓటరు ఎటువైపు?

నగరిలో మరోసారి రోజా గెలుపు ఖాయమని వైసీపీ నేతలు ధీమావ్యక్తం చేస్తోంటే..అటు టీడీపీ నేతలు సైతం విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఐతే టీడీపీలో ఉన్న అంతర్గత సమస్యల కారణంగా వైసీపీ గెలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

news18-telugu
Updated: April 23, 2019, 9:51 PM IST
రోజా గెలుపుపై జోరుగా బెట్టింగ్‌లు...నగరి ఓటరు ఎటువైపు?
రోజా
news18-telugu
Updated: April 23, 2019, 9:51 PM IST
ఏపీలో బెట్టింగ్‌ల కాలం నడుస్తోంది. ఐపీఎల్‌తో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలపైనా బెట్టింగ్ కాస్తున్నారు పందెం రాయుళ్లు. ఓటరు నాడిని విశ్లేషిస్తూ లక్షలకు లక్షలు పందెంలో పెడుతున్నారు. ప్రముఖులు పోటీచేస్తున్న నియోజకవర్గాల్లో 'కాయ్ రాజా కాయ్' దందా జోరుగా సాగుతోంది. లోకేశ్ (మంగళగిరి), బాలకృష్ణ (హిందూపురం), పవన్ కల్యాణ్ (భీమవరం, గాజువాక), రోజా (నగరి) సహా పలువురు సెలబ్రిటీలు పోటీచేసిన నియోజకవర్గాల్లో భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో సినీ నటి, జబర్దస్త్ జడ్జి రోజా పోటీచేసిన నగరి నియోజకవర్గం అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

నగరిలో మరోసారి రోజా గెలుపు ఖాయమని వైసీపీ నేతలు ధీమావ్యక్తం చేస్తోంటే..అటు టీడీపీ నేతలు సైతం విజయంపై పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఐతే టీడీపీలో ఉన్న అంతర్గత సమస్యల కారణంగా వైసీపీ గెలుస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రం వ్యాప్తంగా ఫ్యాన్ గాలి వీచిందని..అది రోజాకు కూడా కలిసి వస్తుందన్న ప్రచారమూ జరుగుతోంది. అంతేకాదు దీర్ఘకాలిక లక్ష్యంతో 2014 నుంచి నగరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు రోజా. సినిమాలు, టీవీ షోలు చేస్తున్నప్పటికీ సమయం చిక్కినప్పుడల్లా నియోజకవర్గంలో తిరిగారు. దాంతో ఈసారి రోజా గెలుస్తుందా? లేదా? అని భారీగా బెట్టింగ్ జరుగుతున్నాయి.

గత ఎన్నికల్లో రోజా కేవలం 858 ఓట్ల మెజార్టీ గెలిచారు. రోజాకు 74,724 ఓట్లు పోలవగా.. టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడుకు 73,866 ఓట్లు పడ్డాయి. ఐతే ముద్దుకృష్ణమ మరణించడంతోఈసారి ఆయన కుమారుడు భాను బరిలో ఉన్నారు. టీడీపీ అభివృద్థి పనులు, పథకాలతో పాటు గాలి ముద్దుకృష్ణ మరణించినందున ఆ సానుభూతి భానుపై ఉంటుందని టీడీపీ లెక్కలు వేసుకుంటోంది. మరి నగరిలో గెలుస్తారన్నది మే 23న తేలనుంది.

ఇది కూడా చూడండి :-First published: April 23, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...