Home /News /politics /

AP ASSEMBLY ELECTIONS 2019 GUNTUR LOK SABHA CONSTITUENCY GROUND REPORT BA

Ground Report: ముగ్గురూ టీడీపీ మూలాలున్న వారే.. గుంటూరు బరిలో గెలిచేదెవరు?

గల్లా జయదేవ్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బొనబోయిన

గల్లా జయదేవ్, మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, బొనబోయిన

    గుంటూరు పేరు వినగానే మొదటగా గుర్తువచ్చేది మిర్చి ఘాటు. ప్రపంచం లోనే అతి పెద్ద మిర్చి యార్డ్ గా గుర్తింపు పొందిన ఈ గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గంలో రాజకీయాలు మరింత ఘాటుగా ఉన్నాయి. గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని ఎవరు దక్కించు కుంటారో అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒకవైపు ప్రధానమంత్రినే ‘మిస్టర్ ప్రైమ్ మినిస్టర్’ అని లోక్‌సభలో ప్రత్యేక హోదా కోసం గళమెత్తి దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీచేస్తున్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఉంటూ, చివరి నిమిషంలో పార్టీ మారిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైసీపీ నుంచి అనూహ్యంగా బరిలో దిగారు. ఇక జనసేన నుంచి అర్బన్ బ్యాంక్ చైర్మన్ బొనబోయిన శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారు. ఆయన చివరి నిమిషం వరకు టీడీపీలో టికెట్ ఆశించి దక్కకపోవడంతో పవన్ కళ్యాణ్ గూటికి చేరారు.

    గల్లా జయదేవ్, గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్ధి


    ఈసారి గుంటూరు లోక్‌సభలో విశేషం ఏంటంటే, ప్రధాన పార్టీల నుంచి బరిలో దిగిన ముగ్గురూ టీడీపీ మూలాలు కలిగిన వారే. ఐతే ఇక్కడ పోటీ మాత్రం ప్రధానంగా తెలుగుదేశం, వైసీపీ మధ్యే నెలకొంది. తెలుగుదేశం అభ్యర్ధి గల్లా జయదేవ్ సిట్టింగ్ ఎంపీ. ఉన్నత విద్యావంతుడు, వివాదరహితుడు. పార్లమెంట్లో మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని పిలిచి దేశం దృష్టిని ఆకర్షించారు. మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేయడం, ప్రభుత్వ పధకాలు కలిసొచ్చే అంశాలు. నియోజకవర్గంలో అందుబాటులో ఉండకపోవటం, ప్రత్యర్థులకు కూడా టీడీపీ కేడర్‌తో సత్సంబంధాలు కలిగి ఉండడం గల్లా జయదేవ్‌కు ప్రతికూలమనే చెప్పాలి.

    మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ ఎంపీ అభ్యర్ధి


    వైసీపీ నుంచి పోటీచేస్తున్న మోదుగుల వేణుగోపాల రెడ్డి 10 సంవత్సరాల పాటు తెలుగుదేశంలో కొనసాగారు. 2009లో ప్రజారాజ్యం నుంచి తెలుగుదేశంలోకి వచ్చి నరసరావుపేట లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. అనంతర పరిణామాల్లో 2014 ఎన్నికల్లో గుంటూరు పశ్ఛిమం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఎలక్షన్ నోటిఫికేషన్ తరువాత వైసీపీ కండువా కప్పుకొని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. తెలుగుదేశంలో క్యాడర్ తో ఉన్న పరిచయాలు, ప్రభుత్వ వతిరేకత కలిసొచ్చే అంశాలు, ముక్కుసూటి తత్వం, ఆర్థికబలం ఆయనకు గెలుపు అవకాశాలను మరింత పెంచాయనే చెప్పాలి.

    బొనబోయిన శ్రీనివాస్ యాదవ్, జనసేన ఎంపీ అభ్యర్థి


    జనసేన నుంచి పోటీ చేస్తున్న బొనబోయిన శ్రీనివాస్ యాదవ్ చివరి నిమిషం వరకు టీడీపీలో టికెట్ కోసం ప్రయత్నించారు. టికెట్ దక్కకపోవడంతో టీడీపీతో 15 ఏళ్ల బంధాన్ని తెంచుకుని జనసేనలో చేరారు. దశాబ్దంన్నర పాటు టీడీపీలో ఉన్న ఆయనకు క్షేత్రస్థాయి కార్యకర్తలతో విస్త్రత సంబంధాలు ఉన్నాయి. అంగబలం, ఆర్థికబలం ఉన్న నాయకుడు. టీడీపీ తనకు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారు.

    Lok sabha elections 2019, Elections 2019, AP Assembly elections 2019, Guntur Lok Sabha Polls, News18 Public pulse, న్యూస్‌18 పబ్లిక్ పల్స్, గుంటూరు లోక్‌సభ, లోక్‌సభ ఎన్నికలు 2019, లోక్‌సభ ఎన్నికలు, ఏపీ అసెంబ్లీ ఎన్నికలు 2019
    గుంటూరు


    బొనబోయిన వల్ల పార్టీకి నష్టం జరుగుతుందని సాక్షాత్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా కలవరపడుతున్నారని సమాచారం. తన గెలుపుకన్నా టీడీపీ అభ్యర్థి ఓటమే తనకు ముఖ్యం అనే రీతిలో బొనబోయిన ప్రచారం సాగుతోంది.

    (రఘు అన్నా, గుంటూరు కరస్పాండెంట్, న్యూస్‌18)
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Guntur S01p13, Janasena party, Lok Sabha Election 2019, Tdp, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు