HOME »NEWS »POLITICS »ap assembly elections 2019 ec rejects tdp kurupam candidate janardhan tatraj nomination sk

టీడీపీ అభ్యర్థికి షాక్...నామినేషన్ తిరస్కరించిన ఈసీ

టీడీపీ అభ్యర్థికి షాక్...నామినేషన్ తిరస్కరించిన ఈసీ
తెలుగుదేశం పార్టీ లోగో

థాట్రాజ్‌ ఎస్టీ కాదంటూ గతంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను చూపించారు. జనార్థన్ అభ్యర్థిత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల అధికారులు థాట్రాజ్‌ నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు.

  • Share this:
    ఏపీలో ఎన్నికలవేళ టీడీపీ అభ్యర్థికి ఎన్నికల అధికారులు షాకిచ్చారు. విజయనగరం జిల్లా కురుపాంలో టీడీపీ అభ్యర్థి జనార్ధన్ థాట్రాజ్‌ నామినేషన్‌‌ను తిరస్కరించారు. నామినేషన్‌లో తప్పులు ఉన్నాయని బీజేపీ అభ్యర్థి నిమ్మక జయరాజ్‌, కాంగ్రెస్‌ అభ్యర్థి నిమ్మక సింహాచలం ఆర్వోకు ఫిర్యాదు చేశారు. ఆరేళ్ల కిందటి ఎస్టీ ధృవీకరణ పత్రాన్ని ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. థాట్రాజ్‌ ఎస్టీ కాదంటూ గతంలో హైకోర్టు, సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వు ప్రతులను చూపించారు. జనార్థన్ అభ్యర్థిత్వాన్ని రద్దుచేయాలని డిమాండ్ చేశారు. దీనిపై విచారణ జరిపిన ఎన్నికల అధికారులు థాట్రాజ్‌ కుల ధృవీకరణ పత్రం చెల్లదని..నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక డమ్మీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన జనార్ధన్ థాట్రాజ్ తల్లి నర్సింహా ప్రియా పోటీలో ఉండనున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:March 26, 2019, 19:58 IST