‘నా మెజారిటీ రాసుకో’.. చంద్రబాబుకు ఆమంచి సవాల్

చీరాల నియోజవకర్గంలో టీడీపీకి 30వేల నుంచి 40 వేల ఓట్లు కూడా రావన్నారు. తాను 40వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

news18-telugu
Updated: April 7, 2019, 3:10 PM IST
‘నా మెజారిటీ రాసుకో’.. చంద్రబాబుకు ఆమంచి సవాల్
ఆమంచి కృష్ణమోహన్ (File)
  • Share this:
సీఎం చంద్రబాబుకి.. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ ఛాలెంజ్ విసిరారు. చీరాల నియోజవకర్గంలో టీడీపీకి 30వేల నుంచి 40 వేల ఓట్లు కూడా రావన్నారు. తాను 40వేల ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు పై 19 కేసులు ఉన్నాయని.. ప్రజా సమస్యల పై పోరాడుతుంటే తనమీద కేసులు నమోదు చేశారు తప్ప, మరే నేరాలు ఘోరాలు తనపై నమోదు కాలేదన్నారు. (ఆమంచి కృష్ణ మోహన్ మీద 29 కేసులు ఉన్నట్టు చంద్రబాబు ఆరోపించారు). చంద్రబాబుకు సిగ్గు వుంటే వాన్ పిక్ పై మాట్లాడకూడదని.. ఎందుకంటే ఆ అంశంపై ఆయన ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించారని ఆమంచి మండిపడ్డారు. చీరాల ప్రాంతం పై చంద్రబాబుకు అవగాహన లేదన్నారు. ఏపీలోని 175 నియోజకవర్గాలలో అతి తక్కువ నిధులు చీరాలకు కేటాయించారని ఆమంచి ఆరోపించారు. చీరాల అభివృద్ధి కేవలం ప్రజలు కట్టిన పన్నులతో మాత్రమే జరిగిందని, చంద్రబాబు ఇచ్చిన నిధులతో మాత్రం కాదన్నారు. రాష్ట్రంలో ఇండిపెండెంట్ హౌస్ లు తాను మాత్రమే కట్టించానని, ఏ MLA కూడా కట్టించలేదన్నారు. రామాయపట్నం పోర్ట్ రాదని ఆమంచి స్పష్టం చేశారు.

First published: April 7, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...