ఎన్నికలు జరిగిన 34 రోజులకు రీపోలింగా? ఈసీపై చంద్రబాబు ఆగ్రహం

9 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలంటూ గతంలో తామిచ్చిన ఫిర్యాదును పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులను మాత్రమే పట్టించుకుంటున్నారని విమర్శించారు.

news18-telugu
Updated: May 17, 2019, 7:04 PM IST
ఎన్నికలు జరిగిన 34 రోజులకు రీపోలింగా? ఈసీపై చంద్రబాబు ఆగ్రహం
చంద్రబాబు (ఫైల్)
  • Share this:
చంద్రగిరిలో రీపోలింగ్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తోంది. ఈసీ నిర్ణయంపై టీడీపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏకంగా ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ సునీల్‌ అరోడా, ఇతర కమిషనర్లతో సమావేశమయ్యారు. ఏపీ ఎన్నికల విషయంలో ఈసీ వ్యవహరిస్తున్న తీరును చంద్రబాబు ప్రశ్నించారు. 9 పోలింగ్ బూత్‌లలో రీపోలింగ్‌ నిర్వహించాలంటూ గతంలో తామిచ్చిన ఫిర్యాదును పట్టించుకోలేదని ఆయన ఆరోపించారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదులను మాత్రమే పట్టించుకుంటున్నారని విమర్శించారు.

సాధారణంగా ఎన్నికలు జరిగిన మరుసటి రోజు రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన నివేదిక ఆధారంగా రీపోలింగ్‌ జరుపుతారు. కానీ ఏపీలో ఎన్నికలు జరిగిన 34 రోజుల తర్వాత రీపోలింగ్‌కు ఎలా ఆదేశిస్తారు? వైసీపీ ఫిర్యాదు మేరకు ఎన్నికలు జరిగిన నెల రోజుల తర్వాత రీపోలింగ్‌ నిర్వహిస్తున్నారు. మోదీ, అమిత్‌షా చెప్పిన ప్రకారమే ఈసీ నడుచుకుంటోంది. 24 ఏళ్లుగా టీడీపీ అధ్యక్షుడిగా ఉండి జాతీయ రాజకీయాలను చూశా. కానీ ఇలాంటి ఈసీని మాత్రం ఎప్పుడూ చూడలేదు.
చంద్రబాబు, ఏపీ సీఎం


మరోవైపు ఏపీలో రీపోలింగ్‌పై రాష్ట్ర ఎన్నికల అధికారి గోపాలక్రిష్ణ ద్వివేది వివరణ ఇచ్చారు. రెండోసారి రీపోలింగ్ జరపకూడదని ఎక్కడా లేదన్న ద్వివేది.. ఘటన ఆలస్యంగా తమ దృష్టికి రావడం వల్లే ఆదివారం రీపోలింగ్‌ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏప్రిల్ 11న జరిగిన ఎన్నికల్లో చంద్రగిరిలోని ఆ 2 పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగాయని తెలిపారు. తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని, వీడియో సాక్ష్యం ఉండటంతోనే రీపోలింగ్‌కు ఆదేశించామని స్పష్టంచేశారు. ఆ వీడియో చూస్తే ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అనిపిస్తోందని చెప్పుకొచ్చారు. పోలింగ్ రోజున విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు ద్వివేది.
First published: May 17, 2019, 7:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading