టీడీపీకి 110 సీట్లు ఖాయం...గెలుపుపై డిప్యూటీ సీఎం ధీమా

తమకు ఎవరి సర్వేల మీద నమ్మకం లేదని..తమకు సొంత సర్వేలు ఉన్నాయని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: May 22, 2019, 3:43 PM IST
టీడీపీకి 110 సీట్లు ఖాయం...గెలుపుపై డిప్యూటీ సీఎం ధీమా
తెలుగుదేశం పార్టీ లోగో
  • Share this:
ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై నరాలే తెగే ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబే మళ్లీ గెలుస్తారా? లేదంటే జగన్ సీఎం అవుతారా? అని ఆంధ్ర ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ జగన్‌కే పట్టంగట్టంగా..ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ సర్వే మాత్రం చంద్రబాబుకు జైకొట్టింది. గెలుపుపై ఎవరికి వారు ధీమావ్యక్తం చేస్తున్నారు. తమ పార్టీయే అధికారంలోకి వస్తుందని ఇటు టీడీపీ, అటు వైసీపీ ఢంకా బజాయిస్తున్నారు. ఈ క్రమంలో టీడీపీకి 110 సీట్లు పక్కాగా వస్తాయని డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్నరాజప్ప స్పష్టంచేశారు.

తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి రాబోతోంది. మహిళలు, వృద్దులు టీడీపీ అండగా నిలిచారు. 110 సీట్లకు పైగా టీడీపీకి వస్తున్నాయి. ప్రజలంతా చంద్రబాబుకు మద్దతుగా నిలిచి ఓట్లు వేశారు. జగన్, మోదీ కలిసి చంద్రబాబును ఆర్థికంగా, రాజకీయంగా దెబ్బకొట్టాలని చూశారు. ఎన్నికల సంఘాన్ని వాడుకొని రాష్ట్రంలో గందరగోళం సృష్టించే ప్రయత్నాలు చేశారు.
నిమ్మకాయల చిన్నరాజప్ప, ఏపీ డిప్యూటీ సీఎం


we join hands with congress party for the sake of national future, says ap home minister nimmakayala chinna rajappa
నిమ్మకాయల చినరాజప్ప(Image:Facebook)


రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన చిన్నరాజప్ప ఈ వ్యాఖ్యలు చేశారు. తమకు ఎవరి సర్వేల మీద నమ్మకం లేదని..తమకు సొంత సర్వేలు ఉన్నాయని స్పష్టంచేశారు.
First published: May 22, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading