ఎన్నికల ఫలితాల వేళ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మరికొన్ని ఆసక్తికర విషయాలు చెప్పారు. అలా చెబుతూనే... తన సర్వే ఆధారంగా పందేలు కాయవద్దనీ, ఈ విషయం మరీ మరీ చెబుతున్నానని మళ్లీ అన్నారు. ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన రోజున కూడా ఆయన ఇదే విధంగా చెప్పారు. ఇందుకు ప్రధాన కారణం... మిగతా సర్వేలకు భిన్నమైన సర్వేను ఆయన చెప్పడమే. బట్... ఆయన సర్వేపై నమ్మకంతో చాలా మంది బెట్టింగ్స్ కాసినట్లు తెలిసింది. రాజకీయ నేతలు, ముఖ్యంగా వైసీపీ నేతలు మాత్రం లగడపాటి సర్వేను చెత్తబుట్టలో పడేయాలని అంటున్నారు. వైఎస్ జగన్ గెలుస్తుంటే, లగడపాటి మాత్రం టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తూ, టీడీపీనే గెలిపించాలని యత్నిస్తున్నారని మండిపడుతున్నారు.
లగడపాటిని నమ్మి ఇదివరకు తెలంగాణ ఎన్నికలప్పుడు చాలా మంది ఆంధ్రా ప్రాంత ప్రజలు, నేతలు బెట్టింగ్సా కాసి అడ్డంగా లాస్ అయ్యారు. ఫలితంగా లగడపాటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈసారి అలా జరగకూడదని భావిస్తున్న లగడపాటి... పందేలు కాయవద్దని కోరుతున్నారు. ఏపీకి సంబంధించిన లగడపాటి సర్వేలో టీడీపీకే మళ్లీ ప్రజలు పట్టం కడతారని చెప్పారు. టీడీపీకి క్లియర్ మెజార్టీ వస్తుందన్నారు. అప్పటి నుంచీ ఏపీలో టీడీపీకి అనుకూలంగా పందేలు పెరిగాయని తెలిసింది.
మహిళల ఓట్లు టీడీపీకే : పసుపు-కుంకుమ స్కీం కావచ్చు, డ్వాక్రా పథకాలు కావచ్చు... కారణం ఏదైనా... టీడీపీకి 6 శాతం మంది మహిళలు అధికంగా ఓట్లు వేశారనీ, ఈ విషయంలో తమకు స్పష్టమైన అంచనా ఉందని తాజాగా వివరించారు లగడపాటి. టీడీపీ గెలిస్తే, అందులో మహిళల పాత్ర కచ్చితంగా ఎక్కువగా ఉంటుందని ఆయన తెలిపారు. ఏపీలో టీడీపీ ప్రభుత్వం వస్తుందనీ, వందకు పైగా సీట్లు టీడీపీకి వస్తాయని మరోసారి అన్నారు. అలా చెబుతూనే తన సర్వే ఆధారంగా పందేలు కాయవద్దని విజ్ఞప్తి చేశారు.
ఇవి కూడా చదవండి :
Election Results : కౌంటింగ్ టెన్షన్... ప్రతి ఒక్కరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవీ...
వైఎస్ జగన్‌కు Z కేటగిరీ భద్రత... ఎందుకో తెలుసా...
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Andhrapradesh, Betting, Lagadapati, Lagadapati survey