AP ASSEMBLY ELECTION RESULTS 2019 RAVALI JAGAN KAVALI JAGAN SLOGAN IS ONE OF THE KEY POINTS IN YCP WINNING NK
రావాలి జగన్... కావాలి జగన్... గ్రాండ్ సక్సెస్...
వైఎస్ జగన్ (Image : Twitter)
AP Assembly Election Results 2019 : పాదయాత్రలు చేసేవారిని ప్రజలు గుండెలకు హత్తుకుంటారని మరోసారి రుజువైంది. తమ కోసం వచ్చిన జగన్‌ను రావాలి జగన్, కావాలి జగన్ అంటూ ప్రజలు ఘనస్వాగతం పలికారు.
టెక్నికల్ అంశాల్లో తిరుగులేని పార్టీ టీడీపీ. టెక్నాలజీని బాగా ఉపయోగించుకోవడంలో ముందుంటారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. అందులో భాగంగానే ఈసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. టీవీల్లో యాడ్లకు టాలీవుడ్ యాక్షన్ డైరెక్టర్ బోయపాటిని ఉపయోగించుకున్నారు. ఆ యాడ్లకు మంచి స్పందనే వచ్చింది. డైలాగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ బాగున్నాయని అన్నారు. ఆ తర్వాత పత్రికల్లో వచ్చిన యాడ్లకు లెక్కలేదు. ఇక ప్రచారం ముగిసే చివరి రోజున సైతం చంద్రబాబు ప్రత్యేకంగా వీడియో క్లిప్పింగ్‌లు చూపించి... వైసీపీ, టీఆర్ఎస్పై విమర్శలు సంధించారు. ఇలా టెక్నాలజీని బాగా వాడుకున్న ఆయన... కచ్చితంగా గెలుపు తమదే అనుకున్నారు. కానీ బొక్కబోర్లా పడ్డారు.
రావాలి జగన్... కావాలి జగన్ :టీడీపీ అంత కాకపోయినా వైసీపీ కూడా తమదైన స్థాయిలో యాడ్లు చేయించింది. ముఖ్యంగా రావాలి జగన్, కావాలి జగన్ అనే టైటిల్ సాంగ్ తో వచ్చిన యాడ్‌కి ప్రజల నుంచీ మంచి స్పందన వచ్చింది. ఇది ఎంతలా ఆకట్టుకుందంటే... ప్రతి ఒక్కరూ ఈ సాంగ్‌ని సరదాగా పాడుకునేంతలా అది మైండ్లోకి ఎక్కేసింది. అదే సమయంలో... రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీం IPAC తెరవెనక వైసీపీ గెలుపుకోసం దాదాపు రెండేళ్ల నుంచీ కృషి చేసింది. సోషల్ మీడియాలో సైతం వైసీపీ అభిమానులందర్నీ ఒకే తాటిపైకి తెచ్చి... ముందుకు నడిపించింది. ఫలితం అదిరిపోయింది. జగన్ కూడా ఊహించనంతటి విజయం వైసీపీకి దక్కింది.
ప్రశాంత్ కిషోర్ కింగ్ :ఉత్తరప్రదేశ్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున వ్యూహాలు రచించి దెబ్బతిన్న ప్రశాంత్ కిషోర్... ఇప్పుడు మాత్రం వైసీపీని గెలిపించడంలో గ్రాండ్ సక్సెస్ అయ్యారు. అందువల్ల ఇప్పుడు ఆయనకు మళ్లీ మంచి రోజులు వచ్చినట్లే. మరిన్ని పార్టీలు ఆయనను రాజకీయ వ్యూహకర్తగా నియమించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అన్నీ వదిలేసి సొంత రాష్ట్రం బీహార్‌కి వెళ్లిపోవాలనుకున్న ప్రశాంత్ కిషోర్... ఇప్పుడు మళ్లీ యాక్టివ్ పాలిటిక్స్‌లో కొనసాగే వీలుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.