ఏపీ ఉద్యోగుల సెగ... టీడీపీకి మరోసారి షాక్...

AP Assembly Election Results 2019 : 2004లో జరిగినట్లే... మరోసారి జరిగిందా... ఏపీలో ఉద్యోగులు చంద్రబాబు పాలనపై తీవ్ర విరక్తి చెందారా?

Krishna Kumar N | news18-telugu
Updated: May 23, 2019, 11:13 AM IST
ఏపీ ఉద్యోగుల సెగ... టీడీపీకి మరోసారి షాక్...
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
ఎన్నికల ఫలితాలకు ముందు ఎన్ని రకాలుగానైనా విశ్లేషించుకోవచ్చు. బట్ ఒక్కసారి ఫలితాలు వచ్చాక... క్లియర్ పిక్చర్ అర్థమవుతుంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని చూస్తే... 2004లో ఏం జరిగిందో, మరోసారి అదే జరిగినట్లు కనిపిస్తోంది. అప్పట్లో ఉద్యోగులు చంద్రబాబు పాలనపై తీవ్ర అసంతృప్తి చెంది... వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఇప్పుడు కూడా అదే జరిగినట్లు కనిపిస్తోంది. టీడీపీకి సర్వేల్లో చెప్పినన్ని సీట్లు కూడా రానట్లు కనిపిస్తోంది ట్రెండ్ చూస్తే. దీనర్థం ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వ పాలనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అనుకోవచ్చు. ఉద్యోగులంతా ఒకే మాటపై నిలబడి వైసీపీని గెలిపించుకున్నట్లు అర్థమవుతోంది.

ఎన్నికలు జరిగిన తర్వాత ఉద్యోగులు చంద్రబాబు సమీక్షలకు హాజరుకాలేదు. ఇది పెద్ద దుమారమే రేగింది. ఇప్పటికీ తానే ముఖ్యమంత్రి అనీ తన సమీక్షలకు ఉన్నతాధికారులు, ఉద్యోగులు రావాల్సిందేనని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఐతే... ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఉద్యోగులెవరూ చంద్రబాబు మాట వినాల్సిన పనిలేదనీ, చీఫ్ సెక్రెటరీ చెప్పిందే వేదం అనీ ఉద్యోగులు వాదించారు. ఈ విషయంపై చంద్రబాబు ఈసీని కలిసి మరీ వివాదాన్ని రగిల్చారు. చివరకు కేబినెట్ మీటింగ్ పెట్టుకోవడానికి ఈసీ అనుమతి ఇవ్వడంతో... చంద్రబాబు ఖుషీగా ఫీలయ్యారు. ఆ మీటింగ్‌కి ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. తద్వారా ఉద్యోగుల మధ్య వివాదం సమసిపోయిందని అంతా భావించారు. ఐతే... లోలోపల ప్రభుత్వంపై ఉద్యోగులకు గూడుకట్టుకున్న వ్యతిరేకత ఆల్రెడీ ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది.

బయోమెట్రిక్ కొంప ముంచిందా : టెక్నాలజీ అంటే ఇష్టపడే చంద్రబాబు... ప్రభుత్వ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం తెచ్చారు. దీని వల్ల ఉద్యోగులు తప్పనిసరిగా వేలిముద్ర ద్వారా బయోమెట్రిక్ పద్ధతిలో హాజరు వేసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు తలనొప్పిలా మారిందని తెలిసింది. చాలా మంది చిన్న ఉద్యోగులు సమయానికి బయోమెట్రిక్ హాజరు వేయలేకపోయేవారు. దీనివల్ల వారి జీతభత్యాల్లో కోత పడేది. ఉన్నతాధికారులు మాత్రం మొబైల్స్ ద్వారా బయోమెట్రిక్ విధానంలో హాజరు వేసేసుకునేవారు. ఆ సదుపాయం ఉన్నతాధికారులకు మాత్రమే ఉండేది. దాని వల్ల చిన్న ఉద్యోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అది ఎన్నికల ఫలితాల్లో స్పష్టమైంది.

ఉద్యోగులతో పెట్టుకుంటే అంతేనా : ప్రభుత్వ ఉద్యోగులకు ఓ అలవాటు ఉంటుంది. వాళ్లలో కుటుంబ సభ్యులంతా ఒకటే మాటపై ఉంటారు. అంటే, ఓటు వేసేటప్పుడు దాదాపు అందరూ ఒకే పార్టీకి ఓటు వేస్తుంటారు. అందువల్ల ఉద్యోగులు ఎంత మంది అసంతృప్తితో ఉంటే, అన్ని కుటుంబాల్లో సభ్యులు కూడా అసంతృప్తితో ఉంటారని అనుకోవచ్చు. అందువల్లే ఉద్యోగులకు ఆగ్రహం వచ్చిన ప్రతిసారీ ప్రభుత్వాలు కుప్పకూలుతున్నాయి. చంద్రబాబు విషయంలో ఇది మరోసారి నిజమైందని అనుకోవచ్చు.
First published: May 23, 2019, 11:13 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading