'ఏపీకి పట్టిన చంద్రగ్రహణం వీడింది'..ఫ్యాన్ గాలి వీచిందన్న బొత్స

ఎన్నికల సంఘంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్రం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడుతున్నారు.

news18-telugu
Updated: April 11, 2019, 9:31 PM IST
'ఏపీకి పట్టిన చంద్రగ్రహణం వీడింది'..ఫ్యాన్ గాలి వీచిందన్న బొత్స
చంద్రబాబు, బొత్స నారాయణ
  • Share this:
ఏపీలో పోలింగ్ ముగిసింది. కొన్నిచోట్ల హింసాత్మక ఘటనలు మినహా రాష్ట్రమంతటా ప్రశాంతంగానే ఎన్నికలు జరిగాయి. పోలింగ్ పూర్తవడంతో...ఎవరు గెలుస్తారన్న దానిపై ఇప్పుడు ఉత్కంఠ నెలకొంది. అధికార టీడీపీ నేతలు కొన్నిచోట్ల రీపోలింగ్‌కు డిమాండ్ చేస్తుండగా...వైసీపీ మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తంచేస్తోంది. ఓటమి భయంతోనే చంద్రబాబు ఈసీని బెదిరిస్తున్నారని.. భారీ మెజార్టీతో గెలవబోతున్నామన్నారు జగన్. ఏపీకి పట్టిన చంద్రగ్రహణం వీడిందంటూ వైసీపీ నేత బొత్సనారాయణ సైతం గెలుపుపై విశ్వాసం వ్యక్తంచేశారు.

నేటితో ఏపీకి పట్టిన చంద్రగ్రహణం వీడింది. రాష్ట్రంలో ఫ్యాన్ గాలి వీస్తోంది. ప్రభుత్వంపై అసంతృప్తి కళ్లకు కట్టినట్లు కనిపించింది. అవినీతి, శాంతిభద్రతలు, దోపిడీలపై తమ అభిప్రాయాన్ని ఓటురూపంలో కనబరిచారు. టీడీపీ నేతలు చివరి వరకు దౌర్జన్యానికి పాల్పడ్డారు. అధికారంలోకి రాగానే హామీలను పూర్తిగా అమలుచేస్తాం.
బొత్స సత్యనారాయణ
కాగా, ఎన్నికల సంఘంపై సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ తీవ్రం ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికల నిర్వహణపై పూర్తిగా వైఫల్యం చెందిందని మండిపడుతున్నారు. చాలా చోట్ల ఈవీఎంలు మొరాయించినా..దిద్దుబాటు చర్యలు చేపట్టలేదని ధ్వజమెత్తారు.


ఇవి కూడా చదవండి:మంగళగిరిలో ఈసీ కుట్ర... ఇక్కడ నుంచి కదలబోనన్న లోకేశ్

గెలుపు మాదే..చంద్రబాబుకు ఓటమి భయం..సిగ్గుతో తలదించుకోవాలన్న జగన్

 
First published: April 11, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు