బెస్ట్ సీఎం అనిపించుకుంటా...విజయవాడలో ప్రమాణస్వీకారం: వైఎస్ జగన్

ఏడాది లోపే బెస్ట్ సీఎం అని ప్రజలందరి చేత అనిపించుకుంటానన్న జగన్..నవరత్నాల అమలే తన లక్ష్యమని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: May 23, 2019, 6:13 PM IST
బెస్ట్ సీఎం అనిపించుకుంటా...విజయవాడలో ప్రమాణస్వీకారం: వైఎస్ జగన్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
దేవుడి దయ, ప్రజల దీవెన వల్లే ఏపీలో వైసీపీ సంచలన విజయం సాధించిందన్నారు వైఎస్ జగన్. ఫలితాల తర్వాత తొలిసారి మీడియాతో మాట్లాడిన ఆయన..ఏపీలో చరిత్రలో ఇది నూతన అధ్యాయమని చెప్పారు. ఈ నెల 30న విజయవాడలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తానని తెలిపారు. ఏడాది లోపే బెస్ట్ సీఎం అని ప్రజలందరి చేత అనిపించుకుంటానన్న జగన్..నవరత్నాల అమలే తన లక్ష్యమని స్పష్టంచేశారు.

ఏపీ ప్రజలు విశ్వసనీయతకు ఓటేశారు. ఇంత పెద్ద విజయం ఎవరి వల్లా కాదేమో..? దేవుడి దయ, ప్రజల దీవెనల వల్లే గెలిచాం.ఈ అఖండ విజయంతో నాపై బాధ్యత మరింత పెరిగింది. 6 నెలల నుంచి ఏడాది లోపే మంచి ముఖ్యమంత్రి అనిపించుటా. దేశం గర్వించేలా పరిపాలన అందిస్తా. ఈనెల 30న విజయవాడలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరుగుతుంది. నాపై నమ్మకం ఉంచి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.
వైఎస్ జగన్
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అఖండ విజయం సాధించింది. దాదాపు 150 స్థానాలు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే 79 స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ..మరో 71 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అధికార టీడీపీ 25 స్థానాలకే పరిమితమైంది. ఇక పవన్ కళ్యాణ్ పార్టీ ఏ మాత్ర ప్రభావం చూపించలేకపోయింది. రెండు స్థానాల్లో పోటీచేసినా ఒక్కచోట కూడా గెలవలేకపోయారు పవన్. జనసేన పార్టీ రాజోలులో మాత్రమే గెలిచి..ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది.
First published: May 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు