ఏపీలో టీడీపీకి షాక్... వెనుకంజలో మంత్రులు

టీడీపీ ఎన్నికల గుర్తు

టీడీపీ తరఫున పోటీ చేసిన పలువురు ప్రముఖులు మూడు నుంచి నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి వెనుకంజలో ఉన్నారు. సీనియర్ మంత్రులు అయ్యన్నపాత్రుడితో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి తదితరులు వెనుకబడ్డారు.

  • Share this:
    ప్రస్తుత ఏపీలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.దీంతో అనేక చోట్ల టీడీపీ వెనుకంజలో కొనసాగుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యంతో దూసుకుపోతోంది. ఏపీలో సీఎం చంద్రబాబుతో సహా మంత్రులంతా షాక్ అయ్యేలా ఏపీలో ఫలితాల సరళి కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేసిన పలువురు ప్రముఖులంతా పోటీలో వెనుకబడిపోయారు. టీడీపీ తరఫున పోటీ చేసిన పలువురు ప్రముఖులు మూడు నుంచి నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి వెనుకంజలో ఉన్నారు. సీనియర్ మంత్రులు అయ్యన్నపాత్రుడితో పాటు మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అమర్ నాథ్ రెడ్డి తదితరులు వెనుకబడ్డారు. మంగళగిరిలో నారా లోకేష్‌ కూడా వెనుకబడ్డారు. ఈ ఫలితాలతో నైరాశ్యంలో పడ్డ తెలుగుదేశం పార్టీ నేతలు, ఇప్పటివరకూ మీడియా ముందుకు వచ్చేందుకు సాహసించలేదు. ఫలితాలు తొలి దశలోనే ఉన్నాయని, ఇంకా ఎన్నో రౌండ్లు లెక్కించాల్సివున్నందున వేచి చూస్తున్నామని కొందరు అంటున్నారు. ఫలితాలు టీడీపీకి వ్యతిరేకమేనన్న సంకేతాలు వెలువడుతున్న పరిస్థితి నెలకొంది. అటు వైసీసీ నేతల మాత్రం ఫుల్ జోష్‌ల్ ఉన్నారు. ఫ్యాన్ గాలి జోరందుకోవడంతో కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
    First published: