గాజువాక, భీమవరంలో వైసీపీ విజయం గెలవగా.. పవన్ కల్యాణ్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. అటు మెగా బ్రదర్ నాగబాబు సైతం నర్సాపురం పార్లమెంట్ స్థానంలో చిత్తుగా ఓడిపోయారు.
ఏపీ ఎన్నికల్లో మెగా బ్రదర్స్ పవన్ కళ్యాణ్, నాగబాబు ఓటమి పాలయ్యారు. కింగ్ మేకర్ అవుదామన్న పవన్ కలలు చెల్లా చెదురయ్యాయి. కింగ్ మేకర్ కాదు కదా..కనీసం ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలవలేకపోయారు. రెండు సీట్లలో పోటీచేసినా ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయారు. గాజువాక, భీమవరంలో వైసీపీ విజయం గెలవగా.. పవన్ కల్యాణ్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. అటు మెగా బ్రదర్ నాగబాబు సైతం నర్సాపురం పార్లమెంట్ స్థానంలో చిత్తుగా ఓడిపోయారు.
గాజువాకలో పవన్ కల్యాణ్‌పై తిప్పాల నాగిరెడ్డి విజయం సాధించారు. అక్కడ 16,486 ఓట్ల తేడాతో జనసేన అధినేత ఓడిపోయారు. నాగిరెడ్డికి 74,769 ఓట్లు పోల్ కాగా... పవన్‌కు 58,283 ఓట్లు పడ్డాయి. ఇక్కడ జనసేనాని రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఇక పవన్ పోటిచేసిన మరోస్థానం భీమవరంలో వైసీపీ అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ గెలుపొందారు. 7,792 మెజార్టీతో ఆయన విజయం సాధించారు. గ్రంథి శ్రీనివాస్‌కు 69,743 ఓట్లు పోల్ అవగా..పవన్‌కు 61,951 ఓట్లు పడ్డాయి. ఇక్కడ కూడా జనసేన అధినేత రెండో స్థానానికే పరిమితమయ్యారు.
అటు నర్సాపురం లోక్‌సభ బరిలో దిగిన నాగబాబు చిత్తుగా ఓడారు. అక్కడ ఆయన మూడో స్థానంతో సరిపెట్టుకున్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థి రఘురామ కృష్ణంరాజు విజయం సాధించగా...టీడీపీ అభ్యర్థి శివరామరాజు రెండో స్థానంలో నిలిచారు. ఇలా అన్నాదమ్ముళ్లిద్దరూ ఓటమి పాలవడంతో జనసేన శ్రేణుల్లో నిరుత్సాహం నెలకొంది.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.