కొన్నిచోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్..85శాతం నమోదయ్యే ఛాన్స్

నిర్దేశిత సమయం ముగిశాక 6 వేల కేంద్రాలకు పైగా పోలింగ్ కొనసాగిందని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల క్రిష్ణ ద్వివేది తెలిపారు. మొత్తంగా 80శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశముందని చెప్పారు.

news18-telugu
Updated: April 11, 2019, 11:00 PM IST
కొన్నిచోట్ల అర్ధరాత్రి వరకు పోలింగ్..85శాతం నమోదయ్యే ఛాన్స్
క్యూలైన్‌లో ఓటర్లు
news18-telugu
Updated: April 11, 2019, 11:00 PM IST
ఏపీలో భారిగా పోలింగ్ నమోదయ్యే అవకాశముంది. పోలింగ్ ముగిసే సమయానికి భారీగా  ఓటర్లు తరలిరావడంతో పోలింగ్ కొనసాగించారు. సాయంత్రం 6 గంటల్లోపు పెద్ద మొత్తంలో ఓటర్లు బారులు దీరడంతో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగింది.  నిర్దేశిత సమయం ముగిశాక 6 వేల కేంద్రాలకు పైగా పోలింగ్ కొనసాగిందని ఏపీ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాల క్రిష్ణ ద్వివేది తెలిపారు. మొత్తంగా 85శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశముందని చెప్పారు.

అంతకుముందు వైఎస్ జగన్ సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. 80శాతం పోలింగ్ నమోదయిందని... మొత్తం పూర్తయ్యే వరకు 85శాతం వరకు చేరుకోవచ్చని చెప్పారు.  పోలింగ్ శాతం భారగా నమోదవడం తమకు కలిసి వచ్చే అంశమన్నారు జగన్. భారీ మెజార్టీతో వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

First published: April 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...