#GroundReport: టీడీపీ వర్సెస్ వైసీపీ... కనిగిరిలో హోరాహోరీ

సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరి బాబూరావును పక్కనపెట్టి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి కనిగిరి టికెట్ కేటాయించింది టీడీపీ. వైసీపీ తరపున బుర్రా మధుసూదన్ యాదవ్ పోటీలో ఉన్నారు.

news18-telugu
Updated: March 30, 2019, 10:00 AM IST
#GroundReport: టీడీపీ వర్సెస్ వైసీపీ... కనిగిరిలో హోరాహోరీ
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఫ్లోరైడ్ బాధితుల ఆక్రందనలు... కరవుతో వలస బాటపట్టే కష్టజీవులు... సగంలోనే ఆగిపోయిన వెలిగొండ ప్రాజెక్టు... ఇవన్నీ ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి బ్రాండ్ ఇమేజ్ ని తీసుకువచ్చి.. పాలకులను ఎగతాలి చేస్తున్నాయి. ఇక్కడ అభివృద్ధి అనే పదం ఎన్నికల నినాదంగా మిగిలిందే గానీ, ఆచరణకు మాత్రం నోచుకోలేదు. ఈ నియోజకవర్గంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్, వామపక్షాలు ఆధిపత్యం చెలాయిస్తే.. ఆ తర్వాత టీడీపీ-వైసీపీ పోరులో విజయం టీడీపీ పక్షాన నిలిచింది. 2014లో ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ స్నేహితుడు కదిరి బాబూరావు… వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పై విజయం సాధించారు. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో మాజీ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి టీడీపీలో చేరడంతో.. ఆ పార్టీ టికెట్ ఆయనకే కేటాయించారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే కదిరిని దర్శి అభ్యర్థిగా ప్రకటించింది. దీంతో అలకబూనిని కదిరి బాబూరావు తన స్నేహితుడు బాలకృష్ణ ద్వారా కనిగిరి సీటుకోసం చివరి వరకూ తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, టీడీపీ అధిష్టానం ఒత్తిడి తీసుకురావడంతో దర్శి నుంచి బరిలో నిలుస్తాను అని ఆయన ప్రకటించారు. గురువారం ఉగ్ర, కదిరి సమావేశమై ఇద్దరూ సహకరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇక్కడ టీడీపీ వైసీపీకి గట్టి పోటీ ఇవ్వడానికి సిద్ధమవుతోంది.

Andhra pradesh, Andhra Pradesh news, Kanigiri constituency ground report, tdp, ysrcp, mukku ugra narasimhareddy, burra madhusudhan Yadav, prakasam district, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, కనిగిరి నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్, టీడీపీ, వైసీపీ, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, ప్రకాశం జిల్లా
కనిగిరి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి( Image: Facebook)


మరోవైపు.. వైసీపీ తరఫున బరిలో ఉన్న బుర్రా మధుసూదన్ యాదవ్ కూడా బలమైన అభ్యర్థే. 2014లో ఓడిపోయినా నియోజకవర్గంలోనే ఉండి వైసీపీ కార్యకర్తలకు అండగా నిలిచారు. ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి పోటీచేస్తుండటంతో ఆయన మద్దతుదారులు తనకు అండగా ఉంటారని విజయం తనదేనని ధీమాగా ఉన్నారు. కానీ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన వైసీపీ పార్టీ కార్యక్రమాలలో కూడా పాల్గొనడం లేదు. కనిగిరి నియోజకవర్గంలోని ఆయనకు బలమైన అనుచరగణం ఉంది.

Andhra pradesh, Andhra Pradesh news, Kanigiri constituency ground report, tdp, ysrcp, mukku ugra narasimhareddy, burra madhusudhan Yadav, prakasam district, ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వార్తలు, కనిగిరి నియోజకవర్గం గ్రౌండ్ రిపోర్ట్, టీడీపీ, వైసీపీ, ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, బుర్రా మధుసూదన్ యాదవ్, ప్రకాశం జిల్లా
కనిగిరి వైసీపీ అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్(Image: Facebook)


వెలిగొండ ప్రాజెక్టు టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ.. సుబ్బారెడ్డి 260 కిలో మీటర్లు పాదయాత్ర చేసి జిల్లాలో బలమైన అనుచర వర్గాన్ని సంపాదించుకున్నారు. ఇప్పుడు వారు ఎంత వరకు కనిగిరి వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలుస్తారు అనేది అనుమానంగా మారింది. నాలుగు రోజుల క్రితం జరిగిన వైఎస్ జగన్ ప్రకాశం జిల్లా పర్యటనలో కూడా వైవీ పాల్గొనకపోవడంతో ఆ పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. దీంతో సొంతపార్టీవారే చేయిస్తే వైసీపీకి ఎదురుదెబ్బ తగులుతుంది అని ఆ పార్టీ నేతలు లోలోన భయపడుతున్నారు.

సీపీఐ పార్టీ ప్రభావం ప్రస్తుతం నామమాత్రంగా ఉంది. పవన్ కల్యాణ్ చరిష్మాను నమ్ముకుని ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి ఎం.ఎల్.నారాయణ బరిలో నిలుస్తున్నారు. కాపు, యాదవ సామాజికవర్గాల ఓటర్ల జనసేన పక్షాన నిలిస్తే సీపీఐ విజయం సాధించకపోయినా... టీడీపీ, వైసీపీ అభ్యర్థుల్లో ఎవరో ఒకరికి షాక్ ఇచ్చే అవకాశం ఉంది.వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందనే భావన జిల్లాలో బలంగా ఉంది. కానీ, ప్రజాస్వామ్య ఎన్నికలు.. ధనస్వామ్య ఎన్నికలుగా మారిన తర్వాత ఈ విషయాన్ని ఎంతమంది పట్టించుకుంటారు అనేది ప్రశ్నార్థకమే. సార్వత్రిక ఎన్నికల్లో కనిగిరి నియోజకవర్గంలో విజయం ఎవరిదో చెప్పడం చాలా కష్ణమని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. పరిస్థితులు ఎలా ఉన్నా టీడీపీ, వైసీపీల మధ్య ఇక్కడ హోరా హోరీ పోరు మాత్రం సాగుతుందని చెప్పక తప్పదు. ఒకవేల నియోజకవర్గంలో బీసీ ఓటర్లు జనసేన ప్రభావంతో సీపీఐకి ఓటు వేస్తే మాత్రం టీడీపీ, వైసీపీ అభ్యర్థుల్లో ఎవరో ఒకరికి షాక్ తగలకు తప్పదు.

(డి.లక్ష్మీనారాయణ, న్యూస్18 ప్రకాశం జిల్లా కరెస్పాండెంట్)
First published: March 30, 2019, 9:30 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading